Asianet News TeluguAsianet News Telugu

డీలర్ల బంద్‌తో రేషన్ పంపిణీ నిలిచిపోదు: ఏపీ మంత్రి కొడాలి నాని


రేషన్ డీలర్లు తమ షాపులు బంద్ చేసినంత మాత్రాన రేషన్ పంపిణీ నిలిచిపోదని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు..జగన్ ప్రవేశ పెట్టిన రేషన్ వెహికిల్స్ ఉన్నాయన్నారు.బైపాస్ పద్దతిలో రేషన్ పంపిణీ చేస్తామన్నారు.

We wont  stop ration distribution  says AP minister Kodali Nani
Author
Guntur, First Published Oct 26, 2021, 8:17 PM IST

శ్రీకాకుళం: Ration dealers  బంద్ చేసినంత మాత్రాన రేషన్ పంపిణీ నిలిచిపోదని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి Kodali Nani  తేల్చి చెప్పారు.శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.Ys Jagan ప్రవేశ పెట్టిన రేషన్ వెహికిల్స్ ఉన్నాయన్నారు.బైపాస్ పద్దతిలో రేషన్ పంపిణీ చేస్తామన్నారు. డీలర్లకు ఏమైనా సమస్యలుంటే చర్చల ద్వారాపరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

also read:ఏపీలో ఇవాళ్టీ నుంచి రేషన్ షాపులు బంద్ ... డీలర్ల సంఘం కీలక ప్రకటన, డిమాండ్లివే..!!

2020 పీఎంజీకేవై కమిషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్కిలస్ ను అమలు చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఐసీడీఎస్ కు మళ్లించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల అసోసియేషన్  డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తోనే ఏపీలో రేషన్ డీలర్లు ఇవాళ్టి నుండి  రేషన్ షాపులు బంద్ నిర్వహిస్తున్నారు.
రేషన్ డీలర్ల బంద్ కు Tdp మద్దతును ప్రకటించింది.రేషన్ దుకాణాల బంద్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలుతీసుకొంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios