అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పరీక్షల నిర్వహణ విషయమై తర్వాత నిర్ణయం తీసుకొంటామని ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు తెలిపింది. టెన్త్ పరీక్షల నిర్వహణపై సోమవారం నాడు  ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో  ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది. హైకోర్టు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకొంది.ముందుగా ప్రకటించిన  షెడ్యూల్ ప్రకారంగానే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం  ఇదివరకు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు సూచన మేరకు ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. 

also read:దిగొచ్చిన వైఎస్ జగన్: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 7 నుండి  టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే జూన్ 7వ తేదీలోపుగా కరోనా కేసుల పరిస్థితి ఆధారంగా పరీక్షలపై నిర్ణయం తీసుకొంటామని ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు ప్రభుత్వం తెలిపింది. టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో పున:పరిశీలన చేయాలని  ప్రభుత్వానికి హైకోర్టు గతంలోనే సూచించింది. ఈ  పిటిషన్ పై విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.