దిగొచ్చిన వైఎస్ జగన్: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది. 

AP government postpones Inter exams due to corona lns

అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు నిర్ణయం తీసుకొంది. ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మేరకు మే 5వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉంది. మే 23వ తేదీవరకు ఇంటర్ ఫరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 5 నుండి 22 వ తేదీ వరకు ఫస్టియర్, మే 6 నుండి 23 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే  పరీక్షలు నిర్వహించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

also read:కోవిడ్ రూంలోకి మీ కూతుళ్లను పంపిస్తారా..?: జగన్ పై కెఏ పాల్ ఫైర్

అయితే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని ఏపీ లో విపక్షాలు డిమాండ్ చేశాయి.  రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో విచారణ సమయంలో హైకోర్టు చేసిన సూచన మేరకు ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు ప్రకటించింది. అయితే టెన్త్ పరీక్షల విషయంలో   ఇంకా ఏపీ ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో సుమారు 30 లక్షలకు పైగా మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులు  పరీక్షలు రాయాల్సి ఉంది. ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తే  కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున  ఈ పరీక్షలను వాయిదా వేయాలని విపక్షాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడిన తర్వాత పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios