ఎయిర్‌ఏసియా ఇష్యూపై జగన్ సాక్షిపై చంద్రబాబు మండిపాటు

we will justice to Fatima college students says Chandrababunaidu
Highlights

ఎయిర్ ఏసియాపై స్పందించిన బాబు

కడప:  ఎయిర్ ఏసియాకు సంబంధించి ఎవరో ఇద్దరు ముగ్గురు పోన్లలో మాట్లాడుకొంటే తనపై పతాకశీర్షికల్లో వార్తలు రాస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయడు చెప్పారు. ప్రతి శుక్రవారం నాడు కోర్టుకు హజరయ్యే నేతలు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని పరోక్షంగా వైఎస్ జగన్ విమర్శలు చేశారు. వైసీపీ ఎంపీలు ఇప్పుడు రాజీనామాలు చేసినా ఉప ఎన్నికలు రావన్నారు. ఈ విషయం తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని ఆయన దుయ్యబట్టారు.

ఎయిర్ఏసీయాకు సంబంధించిన అంశంపై కొన్ని మీడియాలో వచ్చిన వార్తలపై బాబు స్పందించారు. పేరు ప్రస్తావించకుండానే సాక్షి మీడియాపై బాబు మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు ఆరోపించారు. 

ఫాతిమా కాలేజీ విద్యార్ధులను నీట్ పరీక్ష రాయాలని ఆదేశించామన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్ధులకు సీట్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హమీ ఇచ్చారు. పరీక్షలు రాయని విద్యార్ధులకు డబ్బులను వాపస్ ఇప్పించేలా చర్యలుతీసుకొంటామన్నారు.కాలేజీ యాజమాన్యం కూడ విద్యార్ధులను మోసం చేస్తే కఠినంగా శిక్షిస్తామని బాబు హెచ్చరించారు.

కడప జిల్లాలో బుధవారం నాడు జరిగిన నవనిర్మాణ దీక్షలో ఏపీ సీఎంచంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభజించి కేంద్రం అన్యాయం చేసిందన్నారు. 60 ఏళ్ళు సర్వశక్తులొడ్డి సంపద సృష్టించినట్టు ఆయన చెప్పారు. కానీ, ఆనాడు అవమానించి  రాష్ట్ర విభజనకు పాల్పడ్డారు. 

 

విభజన చట్టంలో ఇచ్చిన హమీలను నిలుపుకోలేదని ఆయన బిజెపిపై విమర్శలు గుప్పించారు. కేసులు, రాజకీయం కోసం వైసీపీ బిజెపితో  వైసీపీ లాలూచీ పడిందన్నారు చంద్రబాబునాయుడు. ఇప్పుడు రాజీనామాల వల్ల ఉపయోగం లేదన్నారు. ఈ రాజీనామాలు చేయడం వల్ల ఉప ఎన్నికలు రావన్నారు.ఈ విషయం తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామాల అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఆయన చెప్పారు. కర్ణాటకలో బిజెపిని ఓడించాలని తాను పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, కర్ణాటకలో బిజెపికి అనుకూలంగా వైసీపీ నేతలు ప్రచారం చేశారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. 

రాష్ట్రాభివృద్దికి అడుపడుతూ  లాలూచీ రాజకీయాలకు పాల్పడిన వారిని చిత్తు చిత్తుగా ఓడించాలని బాబు పిలుపునిచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుపడుతున్నారని బాబు కేంద్రంపై మండిపడ్డారు. 

 

ఏపికి అన్యాయం చేసిన అవమానించినవారు అసూయపడేలా  రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు  ఏపీ అభివృద్ది కోసం నిరంతరం శ్రవిస్తున్నట్టు చద్రబాబునాయుడు చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే ఉద్దేశ్యంతోనే ఎన్నికల కంటే బిజెపితో పొత్తు పెట్టుకొన్నామని ఆయన చెప్పారు.కానీ, ఏపీ రాష్ట్రానికి  బిజెపి నమ్మకద్రోహం చేసిందన్నారు.  రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే నవ నిర్మాణ దీక్షను చేపట్టామని ఆయన చెప్పారు

loader