అమరావతి: ఏపీ సీఎం జగన్‌పై శుక్రవారం నాడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. 

గురువారం నాడు సాయంత్రం  అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  సభను అర్ధాంతరంగా  వాయిదా వేసుకొని వెళ్లిపోయారన్నారు.  వడ్డీ రాయితీ ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. సభను తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు.

వైసీపీ వాదన ప్రజల్లోకి వెళ్లిందని... కనీసం తమ వాదనను విన్పించే అవకాశం లేకుండా సభను వాయిదా వేశారని చెప్పారు. ఈ విషయమై తాను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.... తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెబుతారా... రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

జగన్‌కు అహంభావం తప్ప సబ్జెక్టు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు చేశారు. తప్పుడు సమాచారం చెప్పినందుకు జగన్  ఐదు కోట్ల ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సున్న వడ్డీ పథకం పాత పథకమేనని చెప్పారు. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం జీవోను విడుదల చేసినట్టుగా ఆయన చెప్పారు.

 

సంబంధిత వార్తలు

పొలిటికల్ టెర్రరిజం: జగన్‌పై సీరియస్ కామెంట్స్
జగన్ రాజీనామా చేస్తారా: చంద్రబాబు సవాల్