అమరావతి: రాష్ట్రంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ టెర్రరిజం సృష్టిస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.

గురువారం నాడు అసెంబ్లీలో జరిగిన చర్చపై ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో మాకు పాఠాలు నేర్పిస్తారా... ఇదే అహంభావంతో పొలిటికల్ టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీలో కనీసం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

అసెంబ్లీలో తమను మాట్లాడకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడ తమపై ఏకపక్షంగా మాట్లాడుతున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. తాను  సమాచారంతో అసెంబ్లీలోకి వచ్చేలోపుగా సభను వాయిదా వేసి వెళ్లిపోయారన్నారు. రామానాయుడు ప్రసంగం కూడ పూర్తి కాకముందే  సభను వాయిదా వేసి వెళ్లారన్నారు.

అసెంబ్లీలో దౌర్జన్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తులు, నాయకులపై కూడ దాడులు చోటు చేస్తున్నారన్నారు. వైసీపీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు తమ పార్టీ వారిపై దాడులకు దిగారన్నారు. 

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరించిన ఆడియోలను చంద్రబాబు మీడియా సమావేశంలో  విన్పించారు.  రాష్ట్రాన్ని పులివెందులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని  ఆయన  విమర్శించారు.  అసత్యాలు చెప్పేందుకు అలవాటుపడ్డారన్నారు. దీనికి తోడు దౌర్జన్యాలకు కూడ దిగుతున్నారన్నారు.వైఎస్ఆర్ చేసిన పనికి విద్యుత్ కు ఐదేళ్లపాటు సర్‌చార్జీ వేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

జగన్ రాజీనామా చేస్తారా: చంద్రబాబు సవాల్