నన్ను గెలిపించండి అభివృద్ది చూపిస్తా, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుంది: పవన్ కళ్యాణ్

తనను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ది చేసి చూపిస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. శాంతిభద్రతలు ఎలా ఉంటాయో కూడ చూపిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందన్నారు.

We will form government in Andhra pradesh  says pawan kalyan

అమరావతి: నన్ను గెలిపించి చూపించండి అభివృద్ది ఏమిటో చూపిస్తానని జనసేన (jana sena)చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లే దక్కనున్నాయన్నారు.. వచ్చే అసెంబ్లీలో పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తానని ఆయన చెప్పారు. కౌరవ సభను వైసీపీ చూపిందన్నారు. ఊహించనిదే జరిగేది జీవితమన్నారు.వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయించబోతోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మీరో మేం తేల్చుకొందాం రా అంటూ ఆయన  వైసీపీకి సవాల్ విసిరారు. 

బుధవారం నాడు జనసేన (jana sena) చీఫ్ పవన్ కళ్యాణ్  (pawan kalyan ) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.శాంతి భద్రతలు ఎలా ఉంటాయో  చూపిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆడబిడ్డల మీద చేయివేస్తే ఏం జరుగుతోందో చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

also read:యుద్ధం ప్రకటించను...వెనక్కి వెళ్లను, తోలుతీస్తా: వైసీపీకి పవన్ కళ్యాణ్ వార్నింగ్

మీరు ముఖ్యమంత్రి పదవి నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడ తాను ప్రజల కోసం పనిచేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజలకు మాటిచ్చా... ఆ మాటకు కట్టుబడి  ప్రజలకు సేవ చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.తనపై కాపు కులానికి చెందిన వారితోనే ఎందుకు తిట్టిస్తారని ఆయన ప్రశ్నించారు.  అన్ని కులాలతో తనను తిట్టించాలని ఆయన వైసీపీకి సలహా ఇచ్చారు.  కాకినాడలో కాపు  సామాజిక వర్గం ఉన్న చోటే వైసీపీ ఎమ్మెల్యే తనను తీవ్రంగా విమర్శించారని చెప్పారు. 

ప్రజల కోసమే తాను బీజేపీతో పొత్తు పెట్టుకొన్నానని ఆయన చెప్పారు. ఇతర పార్టీల్లో గెలిపించుకొన్న  ప్రజా ప్రతినిధులను  తమ పార్టీలో వైసీపీ చేర్చుకొన్నారన్నారు.  రాష్ట్రాభివృద్ది కోసం ఇతర పార్టీలతో తాను  ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొన్నానని చెప్పారు. 

దాష్టీకం దౌర్జన్యం , దోపీడీ చేసేవాళ్లే తమ పార్టీకి వర్గ శత్రువులన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీకి కమ్మవాళ్లే వర్గ శత్రువులని ఆయన ఆరోపించారు. వర్గపోరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నానని  పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏపీలో పరిస్థితులపై కేంద్ర పెద్దలకు ఎప్పటికప్పుడు తెలుపుతున్నానని ఆయన చెప్పారు.  మా వ్యూహాలను మార్చుకొంటున్నామన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios