Asianet News TeluguAsianet News Telugu

యుద్ధం ప్రకటించను...వెనక్కి వెళ్లను, తోలుతీస్తా: వైసీపీకి పవన్ కళ్యాణ్ వార్నింగ్


తాను యుద్ధం ప్రకటించను.. ఎదుటి వారు యుద్ధంలోకి లాగితే వెనక్కి వెళ్లనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన  మాట్లాడారు.

Pawan kalyan serious comments on Ysrcp
Author
Guntur, First Published Sep 29, 2021, 4:57 PM IST

 అమరావతి: నేను యుద్దం (war)ప్రకటించను... కానీ ఎవరైనా యుద్ధంలోకి లాగితే వెనక్కి వెళ్లనని జనసేన (jana sena చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) స్పష్టం చేశారు. తనతో పెట్టుకొంటే తోలు తీస్తానని ఆయన తేల్చి చెప్పారు.తనను తిడితే భయపడతానని అనుకొంటున్నారేమో మీరు ఎంత తిడితే అంత బలపడుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

తన ఆత్మగౌరవాన్ని దెబ్బకొడితే అంతేస్థాయిలో తిరస్కార భావనను చూస్తారని చెప్పారు.తాను సినిమా టికెట్ల గురించి అడిగితే ఎందుకు సమాధానం చెప్పకుండా తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.బుధవారం నాడు జనసేన (jana sena) చీఫ్ పవన్ కళ్యాణ్  (pawan kalyan ) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

also read:వైసీపీ నేతలకు భయం అంటే ఏంటో నేర్పిస్తా: పంచ్‌లతో వైసీపీ నేతలకు పవన్ కౌంటర్

సినిమా టికెట్ ధరలు ఎంత పెడితే ఆ డబ్బులు నాకొస్తాయా అని ఆయన ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీకి చెందిన నేతలకే సినిమా థియేటర్లున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడానికి మీరెవరని తాను ప్రశ్నించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

తనకు ఎదురే ఉండకూడదని వైసీపీ అనుకొంటే  పొరపాటన్నారు.  జగన్ ప్రమాణస్వీకారోత్సవం రోజున తనను ఆహ్వానించారన్నారు. ఆరోజే తాను తమ పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారన్నారు.  తన ధైర్యమే  ధనమన్నారు. ఇది ఇడుపులపాయ కాదు... ఆంధ్రప్రదేశ్ అని ఆయన చెప్పారు. ప్రతి సన్నాసితో తిట్టించుకోవాల్సిన అవసరం నాకు ఏముందని ఆయన ప్రశ్నించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios