ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

 రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే  జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 

we will conducting  10th, inter exams as per schedule: minister Suresh  lns

అమరావతి: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే  జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సోమవారం నాడు  కరోనాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్   మీడియాకు వివరించారు. 

also read:టెన్త్, ఇంటర్ పరీక్షలపై నేడు ఏపీ సర్కార్ నిర్ణయం: కరోనాపై జగన్ సమీక్ష

కరోనా కేసులు పెరిగిపోతున్నందున  ఈ నెల 20 నుండి 1వ తరగతి నుండి 9వ తరగతుల విద్యార్దులకు సెలవులు ప్రకటించామన్నారు.1 నుండి 9వ తరగతి విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్  చేయాలని ప్రభుత్వం  నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి తెలిపారు.స్కూల్స్ ద్వారా కరోనా కేసులు పెరిగిపోతున్నందున  ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు.కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

 

పరీక్షలు నిర్వహించకపోవడంతో  విద్యార్ధులకు భవిష్యత్తులో నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.  కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో  టెన్త్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రమోట్ చేశారు. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios