టెన్త్, ఇంటర్ పరీక్షలపై నేడు ఏపీ సర్కార్ నిర్ణయం: కరోనాపై జగన్ సమీక్ష

టెన్త్, ఇంటర్ పరీక్షలపై  ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది

AP CM YS Jagan  reviews on  corona cases at camp office lns

అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలపై  ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  రాష్ట్రంలో  కరోనా స్థితిగతులపై  ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ఉన్నతాధికారులతో మధ్యాహ్నం  సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా  కేసులు, వ్యాక్సినేషన్ వైరస్ వ్యాప్తి చెందకుండా  ఉండేందుకు  ఎలా వ్యవహరించాలనే దానిపై  సీఎం అధికారులతో సమీక్షిస్తున్నారు. 

also read:కరోనా అలర్ట్ : మంగళగిరిలో నేటి నుంచి కఠిన ఆంక్షలు

రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  దీంతో టెన్త్ , ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలనే కొందరు  అధికారులు ప్రతిపాదిస్తున్నారు.  అయితే మరికొందరు మాత్రం పరీక్షలను రద్దు చేయాలనే  డిమాండ్  చేస్తున్నారు.  మరోవైపు  బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు పెట్టాలని  జగన్ సర్కార్ భావిస్తోంది. బార్లు, రెస్టారెంట్ల నుండి పార్శిళ్లకు అనుమతి మాత్రమే ఇవ్వాలనే ప్రతిపాదనను అధికారులు చేస్తున్నారు.

మరోవైపు నైట్ కర్ఫ్యూ  విధిస్తే  ఎలా ఉంటుందనే  విషయమై  ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. నైట్ కర్ఫ్యూ విధిస్తే లాభమా, నష్టమా అనే విషయమై ఈ సమావేశం చర్చించే అవకాశం ఉంది. నైట్ కర్ప్యూ విదిస్తే ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీ సర్కార్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios