అవిశ్వాసంపై మా స్ట్రాటజీ ఇదే: రామ్మోహన్ నాయుడు

We tries to expose Bjp in Lok Sabha says TDP MP Rammohan naidu
Highlights

కేంద్ర ప్రభుత్వంపై  అవిశ్వాసంపై చర్చ సందర్భంగా  బీజేపీ ఏపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలని టీడీపీ భావిస్తోంది. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ఏపీని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసిన విషయాలను పార్లమెంట్ వేదికగా  ప్రస్తావించాలని టీడీపీ భావిస్తోంది.


న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వంపై  అవిశ్వాసంపై చర్చ సందర్భంగా  బీజేపీ ఏపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలని టీడీపీ భావిస్తోంది. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ఏపీని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసిన విషయాలను పార్లమెంట్ వేదికగా  ప్రస్తావించాలని టీడీపీ భావిస్తోంది.

అవిశ్వాసాన్ని  తామే ప్రతిపాదించినందున  మరింత సమయాన్ని ఇవ్వాలని టీడీపీ  కోరే అవకాశం లేకపోలేదు.ఈ మేరకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు సమయం మరింత కోరాలని  కూడ ఆయన  ఎంపీలకు దిశా నిర్ధేశం చేశారు.అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీకి 13 నిమిషాల సమయాన్ని స్పీకర్ కేటాయించింది. 

అవిశ్వాసంపై చర్చను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్  ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సమయాన్ని బట్టి టీడీపీ ఎంపీలు  కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రసంగించనున్నారు.  ప్రత్యేక హోదాగానీ, విభజన చట్టంలో ఉన్న హామీలు గానీ... ఏవైతే కేంద్రం నెరవేర్చలేదో వాటిని గుర్తు చేస్తామని అన్నారు. కేంద్రం ఏవైతే కారణాలు పెట్టి జాప్యం చేస్తోందో, అవి సరైన కారణాలు కావన్న విషయాన్ని దేశమంతటికీ తెలిసేలా చూస్తామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

రాష్ట్రానికి  ఇచ్చిన హమీలను అమలు చేయాలనే విషయమై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే  ఏపీకి అన్ని హమీలను అమలు చేసేదని  రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. రెవెన్యూ లోటు, అమరావతికి నిధులు తదితర అంశాలనూ ప్రస్తావిస్తామన్నారు. మొత్తం 19 అంశాలను లోక్ సభలో గుర్తు చేయనున్నట్టు వెల్లడించారు. 

loader