ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అలా పండిన ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ మార్కెల్ లో మంచి డిమాండ్ ఉందని అన్నారు.
రైతులకు అదనపు ఆదాయం లభించేలా చూడాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ (ap cm ys jagan) అన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కోసం చేపడుతున్న ప్రాజెక్టులపై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో (camp office) సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో వీలైనంత త్వరగా వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం పొందేలా చూడాలని తెలిపారు. గోదాములు సహా అన్నిరకాల నిర్మాణాలు ఊపందుకోవాలని చెప్పారు.
ఇప్పుడు సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాల ద్వారా వచ్చిన ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ మార్కెట్ (international market)లో మంచి డిమాండ్ ఉందని సీఎం జగన్ అన్నారు. ఈ అవకాశాలను మన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఆర్బీకే స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం మీద ఒక కస్టం హైర్ సెంటర్ రావాలని సీఎం ఆదేశించారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సేంద్రీయ, సహజ వ్యవసాయం చేయడానికి ఎలాంటి పరికరాలు కావాలో నిర్ణయించి ప్రతీ ఆర్బీకే (rbk) స్థాయిలో ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసే ఉత్పత్తులకు మంచి రేటు వచ్చేలా చూడాలని అన్నారు. ఈ పద్దతుల్లో వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని, దాని కోసం కొత్త విధానాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
అనంతరం రాష్ట్రంలో గోదాముల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో దాదాపుగా గోదాముల నిర్మాణం కోసం స్థల సేకరణ పూర్తయ్యిందని, 278 చోట్ల ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. రైతులు మోసాలకు గురి కాకుండా బరువును, తేమను కొలిచే పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అధికారులు సీఎంకు చెప్పారు. అనంతరం వైఎస్సార్ యంత్ర సేవాపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,497 యూనిట్లను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామని అధికారులు సీఎంకు వివరించారు.
పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా మొత్తంగా 33 చోట్ల విత్తనాలు, మిల్లెట్ (millet) ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు (primery procecing centers) ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. ఇవి వచ్చే కరీఫ్ నుంచి అందుబాటులో వస్తాయని అన్నారు. వీటిని విత్తన శుద్ధి కోసం, ప్రాసింగ్ సెంటర్లుగా కూడా రెండు రకాలుగా ఉపయోగపడుతాయని తెలిపారు. చిరుధాన్యాలు, పప్పు దినుసులు సాగుచేస్తున్న రైతులు ఈ యూనిట్లను చక్కగా వినియోగించుకోచ్చని అన్నారు. ఇలా ప్రాసెస్ చేయడం వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయని, నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయని అన్నారు.
రాష్ట్రంలో 13 సెకండరీ ప్రాసెంసింగ్ యూనిట్ల (secondary procecing unites)ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోందన్న అధికారులు సీఎం జగన్ కు వివరించారు. వీటి ద్వారా సెకండరీ ప్రాసెసింగ్ చేసే వారికి మంచి ముడి పదార్థాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యం కోసం 175 అంబులెన్స్‌లు నియోజకవర్గానికి ఒకటి చొప్పున సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఇవి మార్చి నెలలో ప్రారంభమవుతాయని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 1100 గ్రామాల్లో పాల సేకరణ చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. నెలకు 28,00,502 లీటర్లకుపైగా పాలను సేకరిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకూ 2.03 కోట్ల లీటర్లకుపైగా పాలను సేకరించామని తెలిపారు. వీటి కోసం ఇప్పటి వరకూ రైతులకు రూ.86.58 కోట్ల చెల్లింపులు జరిపామని అన్నారు. వీటి ద్వారా రూ.14.68 కోట్లు అధనంగా రైతులకు లబ్ది కలిగిందని అన్నారు. రాష్ట్రంలో అమూల్ ప్రవేశంతో ఇతర డైరీలు కూడా ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పారు. తూనికల్లో తేడాలు, ఫ్యాట్ నిర్దారణలో మోసాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని అధికారులు అన్నారు. రైతులు మోసాల బారిన పడకుండా చూసుకుంటున్నామని తెలిపారు.
