రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నాం: పురంధేశ్వరి

రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నట్టుగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు   పురంధేశ్వరి చెప్పారు.

We Committed  To  Rayalaseema Declaration : Purandeswari lns

కడప: రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు  పురంధేశ్వరి  చెప్పారు.ఆదివారంనాడు  ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు.పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.  పొత్తులపై  పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి  చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ది శూన్యమని ఆమె విమర్శించారు.  కేంద్ర నిధులను రాష్ట్రం మళ్లిస్తుందని ఆమె  ఆరోపించారు. దీంతో  గ్రామాల్లో  సర్పంచ్ లు అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారని పురంధేశ్వరి  చెప్పారు.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీలో  లేరు. బైరెడ్డి  రాజశేఖర్ రెడ్డి  కూతురు శబరి మాత్రమే  బీజేపీలో  ఉన్నారు.  రాయలసీమ హక్కుల పరిరక్షణ కోసం  పోరాటం చేస్తున్నారన్నారు.  తీగల వంతెన గురించి  కేంద్ర మంత్రి  నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం  సమర్పించవచ్చని చెప్పారు.

 .రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు  పురంధేశ్వరి చర్యలు చేపట్టారు.  ఈ మేరకు  ఇవాళ్టి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ సమావేశాలను నిర్వహిస్తుంది పురంధేశ్వరి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో   ఎక్కువ ఎంపీ సీట్లను దక్కించుకొనేందుకు  బీజేపీ నాయకత్వం ప్లాన్  చేస్తుంది.   ఈ దిశగా  ఆ పార్టీ నాయకత్వం  వ్యూహంతో ముందుకు  వెళ్తుంది.  ఈ వ్యూహంలో భాగంగానే పార్టీలో సంస్థాగత మార్పులకు  శ్రీకారం చుట్టింది. బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీగా  ఉన్న సోము వీర్రాజును తప్పించి  పురందేశ్వరికి  బాధ్యతలను అప్పగించింది  ఆ పార్టీ నాయకత్వం.  ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన  ఎన్డీఏ సమావేశానికి  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ హాజరయ్యారు.   ఏపీ రాష్ట్రంలో పొత్తులపై చర్చించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios