కేంద్ర నిధులను జన్మభూమి కమిటీలు పంచుకొన్నాయి: కన్నా

First Published 14, Jun 2018, 12:09 PM IST
We committed to develop Andhra pradesh says Kanna Laxminarayana
Highlights

బాబుపై కన్నా తీవ్ర వ్యాఖ్యలు


న్యూఢిల్లీ:  కడప స్టీల్ ఫ్లాంట్ నిర్మణంపై  కేంద్ర ప్రభుత్వానికి ఫీజుబులిటి రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.  స్టీల్ ప్లాంట్ నిర్మణంపై  ఏపీ ప్రభుత్వం బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.

న్యూఢిల్లిలో గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. కడప స్టీల్ ఫ్లాంట్ నిర్మాణంపై  ఏపీ ప్రభుత్వం తప్పుడ ప్రచారం చేస్తోందన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. 


విభజన చట్టంలోని హమీలను అమలులో కేంద్రం రాజీ పడడం లేదన్నారు. ఏపీకి ఇచ్చిన హమీల్లో సుమారు 90 శాతం వరకు పూర్తి చేసినట్టు ఆయన చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు మరిన్ని నిధులు ఇవ్వాలని తాము కేంద్రాన్ని కోరినట్టు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చిన నిధులను జన్మభూమి కమిటీలు పంచుకొన్నాయని  కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 
 

loader