ఈఎస్ఐ స్కాం, రాజధానిపై చర్చకు రెడీ: బీఏసీ మీటింగ్ లో అచ్చెన్నాయుడికి జగన్ ఆఫర్

ఈఎస్ఐ, రాజధాని అంశం సహ దేనిపైనా చర్చకు తాము సిద్దంగా ఉన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. బీఏసీ సమావేశంలో టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడుతో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యుల తీరును మంత్రులు తప్పుబట్టారు 

We Are Ready to debate any issue: AP CM YS Jagan To TDP MLA Atchannaidu in BAC Meeting

అమరావతి:  ఏ అంశంపైనైనా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్  టీడీపీ శాసనసభపక్ష ఉఫ నేత అచ్చెన్నాయుడకు  ఆఫర్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై చర్చించారు.ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్  , మంత్రులు, టీడీపీ శాసనసభపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు మధ్య చర్చ జరిగింది. 

ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఏపీ సీఎం జగన్ చెప్పారు. మీరు ఏ అంశం కోరితే ఆ అంశంపై చర్చిద్దామని సీఎం జగన్ అచ్చెన్నాయుడు కు చెప్పారు. అవసరమైతే ఈఎస్ఐ స్కాం పైనే చర్చకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. రాజధాని అంశంపై చర్చ కావాలంటే దానిపై కూడా తాము సిద్దంగా ఉన్నామని కూడా జగన్ స్పష్టం చేశారు.  మీరు 17 మంది ఉన్నారు. మేం 150 మందికిపైగా ఉన్నాం, మీరు రెచ్చగొడితే మా వాళ్లు కచ్చితంగా కౌంటరిస్తారని జగన్ చెప్పారు.

also read:ముగిసిన బీఏసీ మీటింగ్: ఈ నెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరును మంత్రులు తప్పుబట్టారు.  బీఏసీ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జోగి రమేష్ లు టీడీపీ సఃభ్యుల తీరును ప్రస్తావించారు. సభా కార్యక్రమాలు జరగకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడాన్ని మంత్రులు తప్పుబట్టారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కూడా మంత్రులు టీడీపీకి తేల్చి చెప్పారు.

ఈనెల 21వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సిర్ణయం తీసుకున్నారు. ఈ శనివారం,ఆదివారం అెసెంబ్లీకి సెలవులు ఇచ్చారు. సోమవారం నుండి బుధవారం వరకు అసెంబ్లీ పనిచేయనుంది.ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే  తమ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. అయితే అయితే ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios