చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీలో వివాదం సమసిసోయింది
విజయవాడ: చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీలో వివాదం సమసిసోయింది. పార్టీ అధిష్టానం ఎవరికి టిక్కెట్టు కేటాయించినా కలిసి పనిచేస్తామని గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబసభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
నగరి అసెంబ్లీ స్థానం నుండి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రోజా చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముద్దుకృష్ణమనాయుడుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. అయితే అనారోగ్య కారణాలతో ముద్దుకృష్ణమనాయుడు ఇటీవల మృతి చెందాడు.
అయితే నగరి అసెంబ్లీ టిక్కెట్టు తనకే కావాలని ముద్దుకృష్ణమనాయుడు తనయులు భాను, జగదీష్ గొడవపడుతున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు.
టిక్కెట్టు విషయమై ఎవరికి కేటాయించాలో తేల్చుకోవాలని చంద్రబాబునాయుడు సూచించారు. లేకపోతే వేరేవారికి టిక్కెట్టు కేటాయించనున్నట్టు బాబు గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబసభ్యులను హెచ్చరించారు.
దరిమిలా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సమక్షంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబసభ్యులు ఆదివారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబసభ్యులు చర్చించారు.
ఈ సమావేశంలో నగరి టిక్కెట్టు విషయమై గాలి ముద్దుకృష్ణమ నాయడుు కుటుంబసభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు సతీమణి, కొడుకులు భాను, జగదీష్‌లతో చర్చించారు.
అయితే పార్టీ టిక్కెట్టు ఎవరికి ఇచ్చినా సరే తాము కలిసికట్టుగా పనిచేస్తామని గాలి ముద్దుకృష్ణమనాయుడడు కుటుంబసభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆదివారం నాడు బుద్దా వెంకన్న ఇంట్లో సమావేశమైన గాలి సోదరులు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.
శనివారం నాడు నియోజకవర్గం నుండి వచ్చిన ముఖ్య కార్యకర్తల నుండి చంద్రబాబునాయుడు అభిప్రాయాలను సేకరించారు. అయితే జగదీష్, భాను మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆదివారం నాటికి ఏదో ఒకటి తేల్చుకోవాలని బాబు సూచించాడు. ఈ సూచన మేరకు గాలి ఫ్యామిలీ ఏకాభిప్రాయానికి వచ్చారు.
గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబసభ్యుల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. పార్టీ ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని సోదరులిద్దరూ ప్రకటించారు. ఇదే నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నారు
సంబంధిత వార్తలు
