Asianet News TeluguAsianet News Telugu

ఎవరో తేల్చుకోండి...లేకపోతే మరొకరికి ఇస్తా:చంద్రబాబు

 దివంగత నేత మాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుల రాజకీయ భవితవ్యంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నగరి నియోజకవర్గం ఇంచార్జ్ పదవి నేపథ్యంలో గాలి తనయుల మధ్య వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్నదమ్ము ల మధ్య పోరును చక్కదిద్ది పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. 

chandrababu naidu discuss on nagari constituency
Author
Amaravathi, First Published Oct 6, 2018, 6:55 PM IST

అమరావతి: దివంగత నేత మాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుల రాజకీయ భవితవ్యంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నగరి నియోజకవర్గం ఇంచార్జ్ పదవి నేపథ్యంలో గాలి తనయుల మధ్య వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్నదమ్ము ల మధ్య పోరును చక్కదిద్ది పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. 

గాలి ముద్దు కృష్ణమనాయుడు భార్య ఎమ్మెల్సీ సరస్వతి, కుమారులు జగదీష్, భానులతోపాటు నగరి టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. గాలి మరణానంతరం ఇద్దరు కుమారుల్లో ఒకరికి నగరి నియోకవర్గ ఇంచార్జ్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఇంచార్జ్ పదవి నాదంటే నాదంటూ అన్నదమ్ములిద్దరూ ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారు తానే నియోజకవర్గ ఇంచార్జ్ అంటే తానే ఇంచార్జ్ అంటూ చెప్పుకుంటున్నారు. 

ఈ గందరగోళానికి తెరదించేందుకు చంద్రబాబు నాయుడు వారితో సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. చివరికి ఇద్దరిలో ఎవరు ఇన్‌చార్జ్‌గా ఉంటారో రెండు రోజుల్లోగా చెప్పాలని ఆదేశించారు. లేదంటే మరొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తామని తేల్చి చెప్పేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios