ఫాస్టర్ ప్రవీణ్ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు: స్పష్టం చేసిన సీఐడీ
ఫాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా సీఐడీ ఎస్పీ రాధిక స్పష్టం చేశారు. ఫాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు.ఈ వీడియోను చూసిన గుంటూరుకు చెందిన సింగం వెంకట లక్ష్మీనారాయణ ఈ నెల 12న సీఐడీకి ఫిర్యాదు చేశారు.
గుంటూరు: ఫాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా సీఐడీ ఎస్పీ రాధిక స్పష్టం చేశారు. ఫాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు.ఈ వీడియోను చూసిన గుంటూరుకు చెందిన సింగం వెంకట లక్ష్మీనారాయణ ఈ నెల 12న సీఐడీకి ఫిర్యాదు చేశారు.
ప్రవీణ్ వ్యాఖ్యల వీడియోను కూడ ఫిర్యాదుకు లక్ష్మీనారాయణ జత చేశారు.ఈ కేసును సీఐడీ బృందం దర్యాప్తు చేస్తోంది. ప్రవీణ్ చక్రవర్తిని ఈ నెల 13న అరెస్ట్ చేశారు. గంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు. ఈ నెల 23 వ తేదీతో ప్రవీణ్ చక్రవర్తి కస్టడీ ముగియనుంది.
ప్రవీణ్ చక్రవర్తి విషయంలో ప్రభుత్వం ఎందుకు రహస్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ ప్రశ్నించింది. గురువారం నాడు చంద్రబాబు మీడియా సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీఐడీ ప్రకటించింది. అన్ని కోణాల్లో కేసును పరిశోధిస్తున్నామని ఎస్పీ టీఆర్ఎస్ రాధిక తేల్చి చెప్పారు.
ఈ కేసు విషయమై ప్రజలను రెచ్చగొట్టేలా, మతాలను కించపర్చేలా మీడియాలో కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొంటామని ఎస్పీ హెచ్చరించారు.ఇప్పటికే ప్రవీణ్ పై 153/ఎ,153 బి(1)(సి), 505(1)(సి), 505(2)295(ఎ), 124(ఎ), 115 రెడ్ విత్ 66 తీవ్రమెన సెక్షన్లపై కేసు నమోదు చేశారు.