Asianet News TeluguAsianet News Telugu

సగం ఆంధ్రా కొట్టుకుపోయే ప్రమాదం: శ్రీశైలం డ్యాంపై వాటర్ మాన్ ఆఫ్ ఇండియా వార్నింగ్

వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ శ్రీశైలం డ్యాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేయకపోతే పెను ప్రమాదం తప్పదని రాజేంద్రసింగ్ హెచ్చరించారు. శ్రీశైలం డ్యాంకు ఏదైనా విపత్తు సంభవిస్తే దాదాపు సగం ఆంధ్ర కనిపించకుండా పోతుందని స్పష్టం చేశారు. 

waterman of india rajendra singh sensational comments on srisailam dam
Author
Kurnool, First Published Nov 21, 2019, 5:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన శ్రీశైలం డ్యాంకు ప్రమాదం పొంచి ఉందా....?విపత్తు సంభవిస్తే సగం ఆంధ్ర కనిపించే అవకాశమే లేదా....?డ్యాం మెయింటినెన్స్ చేయకపోవడమా ప్రధాన కారణమా...? ఫ్లంజ్ ఫూల్ వద్ద ఏర్పడిన గొయ్యి ప్రమాద హెచ్చరికను తెలియజేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. శ్రీశైలం డ్యాంకు ప్రమాదం పొంచి ఉందంటూ వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు అందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. 

వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ శ్రీశైలం డ్యాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేయకపోతే పెను ప్రమాదం తప్పదని రాజేంద్రసింగ్ హెచ్చరించారు. శ్రీశైలం డ్యాంకు ఏదైనా విపత్తు సంభవిస్తే దాదాపు సగం ఆంధ్ర కనిపించకుండా పోతుందని స్పష్టం చేశారు. 

ప్రభుత్వం డ్యాం మెయింటినెన్స్ చేయకపోవడమే ప్రధాన కారణమని ఆరోపించారు. డ్యాం గేట్ల నుంచి వాటర్ లీకేజ్, డ్యాం ముందుగల ఫ్లంజ్ ఫూల్ దగ్గర పెద్ద గొయ్యి ఏర్పడటం ముందుగా ప్రమాదాన్ని తెలియజేస్తుందని తెలిపారు.  

ప్లంజ్ పూల్ అంటే డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి  నీరు విడుదలై స్పిల్ వే ద్వారా దిగువ ఉన్న తొట్టిలోకి న ీరు చేరుతుంది. అక్కడ నుంచి డ్యామ్ పునాదులకు దూరంగా నీరు పడుతుంది. ఇలా వరద నీరు పడే ప్రాంతాన్ని  ప్లంజ్ పూల్ గా చెప్తారు. ప్లంజ్ పూల్ పటిష్టతను దృష్టిలో పెట్టుకొని నిర్మాణ సమయంలోనే అత్యంత బలమైన కాంక్రీట్ డ్రమ్స్ ను డ్యాం లో ఏర్పాటు చేస్తారు. 

కృష్ణానదిపై నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో శ్రీశైలం ప్రాజెక్టు రెండోది. ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందిస్తుంది. అలాగే విద్యుత్ ఉత్పాదనకు కూడా ఉపయోగపడుతుంది. 55 ఏళ్ల క్రితం కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించారు. 

శ్రీశైలం డ్యాం వద్ద 12 రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. డ్యాం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా డ్యాం నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలంకు వచ్చే వరద నీటిని క్రస్ట్ గేట్లను తెరిచి నీటిని విడుదల చేయడంతో గేట్ల ముందు భాగంలో భారీ గొయ్యి ఏర్పడింది. 

ఈ గొయ్యివల్ల ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అన్న సందేహం నెలకొంంది. డ్యామ్ పునాదుల వరకు ఈ గొయ్యి ప్రభావం ఉంటే పరిస్థితి ఏంటన్న సందేహం నెలకొంది. ఇప్పటికే పలుమార్లు ఇంజనీరింగ్ అధికారులు సర్వే సైతం నిర్వహించారు.  

డ్యాం క్రస్ట్ గేట్ల నుంచి విడుదలయ్యే వరదనీరు స్పిల్ వే వద్ద తొట్టిలో పడి అక్కడ నుంచి దిగువకు చేరుతుంది. 1999, 2009లలో శ్రీశైలానికి ఊహించని విధంగా భారీ వరద నీరు వచ్చినప్పుడు 12 రేడియల్ క్రస్ట్ గేట్లను పూర్తిగా తెరచి దిగువకు నీరు వదిలారు అధికారులు. 

దిగువకు వదిలిన నీటి ప్రభావంతో కింద ఉన్న ప్లంజ్ పూల్ వద్ద గొయ్యి ఏర్పడింది. ఇది 1999లో 60 అడుగుల లోతులో ఏర్పడింది. 2009లో వరదలలో ఆ గొయ్యి లోతు 100 అడుగులకు చేరుకుంది. 2019 అంటే ఈ ఏడాది డ్యాంకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరడంతో గొయ్యి ఇంకా ఎన్ని అడుగులు లోపలికి ఏర్పడిందోనన్న ఆందోళన నెలకొంది. 

డ్యాం భద్రత దృష్ట్యా ఇరిగేషన్ అధికారులు 2019 మే నెలలో విశాఖపట్నం, గోవా నుంచి వచ్చిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలతో అండర్వాటర్ వీడియోగ్రఫీ సర్వే చేయించారు. 

ఫ్లంజ్ ఫూల్ వద్ద ఏర్పడ్డ గొయ్యి ప్రమాదకరమని శా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అంతకుముందు 2000-2012 సంవత్సరాల్లో గోవాకు చెందిన జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థ ప్లంజ్ పూల్ వద్ద అండర్ వాటర్ వీడియోగ్రఫీ చేసి గొయ్యి ఎంత లోతుప్రభావం గురించి సర్వే చేసింది . 

2019  జనవరి 30న బ్యాతమ్యాటికల్ సర్వే కూడా చేశారు. బ్యాతమ్యాటికల్, అండర్ వాటర్ వీడియోగ్రఫీ నివేదికలను పాత నివేదికలతో పోల్చి కొత్త నివేదికను అధికారులు రూపొందించారు. అనంతరం సెంట్రల్ ఆర్గనైజేషన్ విజయవాడ సీడబ్ల్యూసీ ప్రాజెక్టు నిపుణుల బృందానికి ఈ నివేదికను అందజేశారు. ప్లంజ్ పూల్ పటిష్టతపై చర్చించారు. 

ఇకపోతే శ్రీశైలం జలాశయానికి 9  లక్కీనంబర్ గా చెప్తుంటారు. ఎందుకంటే1998, 2009, 2019లలో మూడు సార్లు భారీగా వరద నీరు వచ్చి చేరింది. 1998, 2009 సంవత్సరంలో అయితే దిగువనున్న కుడిగట్టు తెగిపోయి జలవిద్యుత్ కేంద్రం జలసమాధి అయిపోయింది. 

2019 సంవత్సరంలో శ్రీశైలం జలాశయాన్ని 7 సార్లు క్రస్ట్ గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. కేవలం ఒకే సంవత్సరంలో 7 సార్లు గేట్లు తెరచి నీటి విడుదల చేయడం  మొదటిసారి.  

ఎన్నడూ లేనివిధంగా జలాశయం గేట్లను 7 సార్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల గేట్లకు ఉండే రబ్బర్ స్లీవ్స్, సీళ్ళు  అరిగిపోయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతుంది. మరమత్తుల లోపం వల్ల గేట్ల నుంచి వాటర్ లీక్ అవ్వడం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.  

రెండు రోజుల క్రితం వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ఐదే విషయాన్ని ప్రస్తావించారు. గంగజల్ సాక్షారత్ యాత్ర లో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన శ్రీశైలం డ్యాంపై పలు కీలక సూచనలను చేశారు. 

శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందని వెంటనే మరమ్మత్తులు చేయకపోతే పెనువిషాదం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వాలు నదులపై ప్రాజక్ట్ లు నిర్మిస్తున్నాయే తప్ప వాటి నిర్వహణా బాధ్యతలను సరిగా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పాలకులు ప్రభుత్వాలు శ్రీశైలం ప్రాజెక్ట్ ను పట్టించుకోకపోతే భారీ మూల్యం చెల్లిచుకోకతప్పదని రాజేంద్రసింగ్ హెచ్చరించారు. 

వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ వ్యాఖ్యలతో ఆ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ప్రాజెక్టుకు ఏదైనా విధ్వంసం ఏర్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆ ప్రచారం అంతా వట్టిదే: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

Follow Us:
Download App:
  • android
  • ios