బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబుపై ప్రధానికి ఫిర్యాదు

First Published 26, Mar 2018, 8:03 PM IST
Water man rajendra singh made complaint on sand mafia in AP
Highlights
ఏపిలో యధేచ్చగా సాగుతున్న ఇసుక మాఫియాపై మొదటిసారిగా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందింది.

ఏపిలో యధేచ్చగా సాగుతున్న ఇసుక మాఫియాపై మొదటిసారిగా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. అదికూడా రాజకీయ ఫిర్యాదు కాదు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, నీటి సంరక్షణ ఉద్యమకారుడు డాక్టర్ రాజేంద్రసింగ్ చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. టిడిపి ప్రభుత్వంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని చెప్పటమంటే చంద్రబాబుపై ఆరోపణలు చేయటమే.

అధికార టీడీపీ నేతల అండతో ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణ, గోదావరి నదుల వద్ద యథేచ్ఛగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు.

ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వాళ్ళపై ఆయుధాలతో దాడులు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదన్నారు. ఇసుక మాఫియాతో అన్ని స్థాయిల అధికారులు కుమ్మక్కు అయినట్లు ఆరోపించారు. అక్రమ తవ్వకాలతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని మండిపడ్డారు. టీడీపీ నేతల అరాచకాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, అటవీశాఖతో దర్యాప్తు చేయించాలంటూ ఫిర్యాదులో డిమాండ్ చేశారు.  

 

loader