అసెంబ్లీలో వైఎస్ జగన్ ఛేంబర్ లో మళ్లీ వర్షం నీరు

Water leakage in YS Jagan's chamber in assmebly
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ప్రతిపక్ష నేత వైయెస్ జగన్ ఛేంబర్ లోకి వర్షం నీరు వచ్చి చేరింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ప్రతిపక్ష నేత వైయెస్ జగన్ ఛేంబర్ లోకి వర్షం నీరు వచ్చి చేరింది. మంగళవారంనాడు కురిసిన చిన్నపాటి వర్షానికే చేంబర్ లోకి నీరు వచ్చి చేరింది. గతంలో కూడా జగన్ ఛేంబర్ లోకి వర్షం నీరు వచ్చి చేరిన విషయం తెలిసిందే. 

ఛేంబర్ లోకి వర్షం నీరు ఎలా వచ్చి చేరిందనే విషయంపై సిఆర్డిఎ అధికారులు పరిశీలన చేశారు. నీళ్లు రావడంపై అసెంబ్లీ సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ప్రశ్నించారు. ఫైర్ ఇంజన్ తో తనిఖీలు చేశారు. లీకేజీ వల్లనే నీరు వచ్చి చేరిందనే నిర్ధారణకు వచ్చారు.

మంగళవారంనాటి వర్షంతో చాంబర్ లోని సీలింగ్ నుంచి వర్షం నీరు ధారగా కారింది. ఇంచార్జీ కార్యదర్శి ఆదేశంతో వర్షం నీటిని శాసనసభ సిబ్బంది ఎత్తిపోశారు. 

నిరుడు జూన్ లో కురిసిన వర్షానికి ఇదే విధంగా జగన్ ఛేంబర్ లోకి నీరు చేరింది. ఆ సంఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. అమరావతి భవన నిర్మాణంలో నాణ్యత లోపించిందనే విమర్శలు వచ్చాయి.

loader