నెల్లూరు: జీశాట్-29  ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది.బుధవారం నాడు నెల్లూరు జిల్లా శ్రీహారి కోటలోని అంతరిక్ష కేంద్రం నుండి ఈ ఉపగ్రహన్ని రాకెట్ మోసుకెళ్లింది

జీఎస్ఎల్వీ మార్క్ -3  ప్రయోగంతో ఇస్రో మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రయోగంతో సమాచార వ్యవస్థ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.43.4 మీటర్ల పొడవున్న ఈ ఉపగ్రహం 640 టన్నుల బరువు ఉంది.  జీశాట్- 29 ఉపగ్రహన్ని రాకెట్ కక్షలోకి ప్రవేశపెట్టడంతో  శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందించుకొన్నారు. 

భారత్ ప్రయోగించిన అత్యంత బరువున్న శాటిలైట్‌గా జీశాట్-29 పేరుంది. 10 ఏళ్ల పాటు ఈ శాటిలైట్ పనిచేయనుంది. శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మెన్ శివన్ అభినిందించారు. జనవరి మాసంలో చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని శివన్ ప్రకటించారు. జీఎస్ఎల్వీ మార్క్-డీ2 ప్రయోగం విజయవంతమైందన్నారు.