నెల్లూరు జిల్లాలో వార్డు వాలంటీర్ ఓవరాక్షన్ చేశాడు. మద్యంలో మత్తులో మహిళా ఎస్సై పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే... ఆత్మకూరులోని 21వ వార్డుకు చెందిన వాలంటీర్‌ సోమవారం అర్థరాత్రి మరికొందరితో కలిసి పీకలదాకా మద్యం తాగాడు.

Also Read:తొమ్మిదో తరగతి విద్యార్థినిపై వాలంటీర్ అఘాయిత్యం

ఈ క్రమంలో ఎస్సై రోజాలత పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి అటుగా వచ్చిన వాలంటీర్‌ను అతని మిత్రులను పోలీసు సిబ్బంది ఆపారు. దీంతో రెచ్చిపోయిన వాలంటీర్... రోజాలతను అసభ్యపదజాలంతో దూషించాడు.

మహిళ అని కూడా చూడకుండా తిట్ల పురాణం అందుకున్నాడు. అక్కడితో ఆగకుండా అంతు చూస్తానంటూ బెదిరిస్తూ... నడిరోడ్డుపై చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. అతనితో పాటు మరో వాలంటీర్ భర్త కూడా ఉన్నాడు.

Also Read:వార్డు వాలంటీర్ అరాచకం.. తల్లీకొడుకులపై స్నేహితులతో కలిసి దాడి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆయనపై సీఐ కేసు నమోదు చేయగా.. ఆ తర్వాతి రోజే ఆయన బదిలీ కావడం పట్టణంలో చర్చనీయాంశమైంది.