ఏపీకి ప్రత్యేక హోదా కోసం సెల్‌టవరెక్కిన తెలంగాణ యువకుడు

Warangal Young man protest on cell tower for special status to AP
Highlights


ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ న్యూఢిల్లీలోని సెల్‌టవర్‌ ఎక్కి  ఉమేష్ రెడ్డి అనే  యువకుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన  ఉమేష్ రెడ్డి  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సెల్‌టవర్‌పై ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాడు.
 


న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ న్యూఢిల్లీలోని సెల్‌టవర్‌ ఎక్కి  ఉమేష్ రెడ్డి అనే  యువకుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన  ఉమేష్ రెడ్డి  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సెల్‌టవర్‌పై ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాడు.


విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలని  కూడ ఆ యువకుడు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాను  ఇవ్వాలని ప్ల కార్డును పట్టుకొని నిరసన వ్యక్తం చేశాడు.  అయితే ఉమేష్ రెడ్డి ఆందోళనను చూసిన పోలీసులు అతడిని కిందకు దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

వరంగల్ జిల్లాకు చెందిన ఉమేష్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కోసం సెల్‌టవర్‌పై నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. అయితే  ఉమేష్ రెడ్డిని సెల్ టవర్ నుండి కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకొన్న ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు కూడ ఉమేష్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.  ఉమేష్ రెడ్డిని కిందకు రప్పించేందుకు చర్చిస్తున్నారు. 

సెల్ టవర్ నుండి కిందకు దింపిన యువకుడు నచ్చచెప్పి అధికారులు ఉమేష్ రెడ్డి కిందకు దించారు. సెల్ టవర్‌పై ఉన్న ఉమేష్ రెడ్డిని  అధికారులు నచ్చజెప్పి కిందకు తీసుకొచ్చారు. ఈ విషయమై ఢిల్లీ పోలీసు అధికారులు తెలుగు మాట్లాడేవారితో ఉమేష్ రెడ్డికి నచ్చజెప్పించారు. దీంతో రమేష్ రెడ్డి కిందకు దిగారు.

loader