Asianet News TeluguAsianet News Telugu

బాబును అడ్డుకొన్న క్షురకులు: ఏం చేసుకొంటారో చేసుకోండన్న సీఎం, ఉద్రిక్తత

బాబు కాన్వాయ్ ను అడ్డుకొన్న క్షురకులు

war words betweenTemple barbers Ap cm chandrababunaidu


అమరావతి: దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును సోమవారం నాడు సచివాలయంలో అడ్డుకొన్నారు. క్షురకులకు, ఏపీ సీఎం  చంద్రబాబునాయుడుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. నాయిబ్రహ్మణ సంఘం నేతల తీరుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. విధుల్లో చేరాలని ఆయన కోరారు. కనీస వేతనం ఇవ్వాలనే డిమాండ్ సాధ్యం కాదని బాబు తేల్చి చెప్పారు.ఏం చేసుకొంటారో చేసుకోవాలని క్షురకులపై సీఎం మండిపడ్డారు. 

ఏపీలోని పలు దేవాలయాల్లో క్షురకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తితో క్షురకులు సోమవారం నాడు మధ్యాహ్నం సచివాలయంలో సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో క్షురకుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. అయితే డిప్యూటీ సీఎం కెఈ తో చర్చలు విఫలమైనట్టుగా క్షురకులు ప్రకటించారు. ఈ విషయమై అమరావతి సచివాలయంలో మీడియాకు చెబుతున్నారు.

అదే సమయంలో సచివాలయం నుండి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్తున్నాడు.ఈ విషయాన్ని గమనించిన క్షురకులు బాబు కాన్వాయ్ కు అడ్డుపడ్డారు.  కారులో నుండి దిగిన బాబు నాయి బ్రహ్మణ సంఘం నేతల సమస్యలను వినేందుకు ప్రయత్నించారు.

అయితే తమకు కనీస వేతనం ఇవ్వాలని క్షురకులు డిమాండ్ చేశారు. అయితే సాధ్యం కాదని చంద్రబాబునాయుడు చెప్పారు. కేశ ఖండన టిక్కెట్టును రూ.25 కు పెంచనున్నట్టు బాబు నాయిబ్రహ్మణ సంఘం నేతలకు చెప్పారు.  కానీ, తమ డిమాండ్ల విషయమై నాయిబ్రహ్మణ సంఘం నేతలు బాబుతో వాగ్వాదానికి దిగారు.

చంద్రబాబునాయుడు కూడ తీవ్ర ఆగ్రహన్ని ప్రదర్శించారు. ఇష్టం ఉంటే చేయాలి లేకపోతే వెళ్ళిపోవాలని హెచ్చరించారు. ప్రజలపై కూడ భారం పడకుండా  ఉండాలనేదే ప్రభుత్వ నిర్ణయమని ఆయన చెప్పారు.

నాయి బ్రహ్మణ సంఘం నేతలు కూడ బాబుతో వాగ్వాదానికి దిగారు. అసలు ఇంతమందిని ఎలా రానిచ్చారని బాబు ప్రశ్నించారు. 9 ఏళ్ళ పాటు సీఎంగా పాలన చేశానని ఆయన చెప్పారు. ఆనాడు ఎవరు కూడ రోడ్డుపైకి రాలేదన్నారు. న్యాయం ఉంటే తాను వస్తానని ఆయన చెప్పారు. కనీస వేతనం ఇవ్వలేమని బాబు తేల్చి చెప్పారు.

నాయిబ్రహ్మణ సంఘం నేతలను ఫ్రీగా వదిలేయాలని పోలీసులకు చెప్పారు. ఏం చేస్తారో చూద్దాం అంటూ బాబు వారిపై సీరియస్ అయ్యారు. సచివాయం అంటే దేవాలయమన్నారు. గతంలో కంటే రెట్టింపు డబ్బులు వచ్చేలా చేశామని విధుల్లో చేరాలని బాబు సూచించారు.

కానీ, కనీస వేతనం ఇస్తేనే విధుల్లో చేరుతామని ప్రకటించడంతో  బాబు తీవ్ర ఆగ్రహన్ని ప్రదర్శించారు. ఏం చేసుకొంటారో చేసుకోవాలని బాబు వారిని హెచ్చరించారు. నాయిబ్రహ్మణ సంఘం నేతను ఏ ఊరు నీదంటూ బాబు తీవ్ర ఆగ్రహవేశాలను వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబునాయుడు కూడ ఆగ్రహంతో ఊగిపోయారు. విధుల్లో చేరాల్సిందేనని తేల్చి చెప్పారు. సమ్మెను విరమించబోమని ప్రకటించడంతో బాబు అదే స్థాయిలో ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios