ap assembly session: ఏపీ అసెంబ్లీ‌లో చంద్రబాబు వ్యాఖ్యలపై గందరగోళం

ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. పీపీఏల సమీక్షపై చర్చ విషయమై టీడీపీ, వైసీపీ మధ్య చర్చ విషయమై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ సభ్యులపై విమర్శలు ఎక్కుపెట్టారు. 

War Words Between TDP Ysrcp MLAS in Ap Assembly


అమరావతి: పీపీఏ సమీక్షలపై ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు గందరగోళం చోటు చేసుకొంది.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  చేసిన వ్యాఖ్యలపైసభలో గందరగోళం నెలకొంది. 

చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

పీపీఏ సమీక్ష విషయమై  ఏపీ  ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పారు. ప్రభుత్వం పూర్తిస్థాయి సమాధానం చెప్పిందని స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. ఈ విషయమై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. చంద్రబాబునాయుడు కూడ మాట్లాడేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు. పీపీఏపై చర్చపై మరో పద్దతిలో చర్చకు రావాలని స్పీకర్ టీడీపీ సభ్యలకు సూచించారు.ఈ విషయమై తాము నిరసన తెలుపుతామని చంద్రబాబునాయుడు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. 

ఇదే సమయంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రితో పాటు అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి అని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.

Read aklso: AP Assembly : ఏపీ అసెంబ్లీలో "కేసీఆర్" రచ్చ

ప్రశ్నోత్తరాల సమయంలో  నిరసన తెలిపే సంప్రదాయం లేదన్నారు. కొత్త సంప్రదాయానికి టీడీపీ సభ్యులు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.

 నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే పద్దతులను తీసుకురాకూడదని ఆనం రామనారాయణరెడ్డి కోరారు. నిరసన చెప్పే అవకాశాన్ని స్పీకర్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.

ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలిపే హక్కు లేదని  స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు పదే పదే ఈ విషయమై పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళవాతావరణం నెలకొంది.

 ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు సభలో అరాచకశక్తులు ఉన్నాయని చెప్పడం సరైంది కాదని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతిపక్ష నాయకుడు వచ్చి తన సీటు పక్కన నిలబడితే తాను ఏం మాట్లాడుతానని ఆనం రామనారాయణరెడ్డి  సభలో ప్రశ్నించారు.

Read also: నిరుద్యోగులకు జగన్ మరో శుభవార్త: మెగా నోటిఫికేషన్ కు రంగం సిద్ధం

విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు నిలబదితే తాను మాట్లాడే ధైర్యం ఉందన్నారు. కానీ, చంద్రబాబునాయుడు వచ్చి తన పక్కన నిలబడితే  ఏం మాట్లాడుతానని ఆనం రామనారాయణరెడ్డి అనగానే ఏపీ సీఎం వైఎస్ జగన్  నవ్వారు.

అచ్చెన్నాయుడు వచ్చి అడ్డం నిలబడ్డారు, లేకపోతే ఏం జరిగేదో తనకు అర్ధం కావడం లేదని  వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఈ సందర్భంగా  ప్రస్తావించారు.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios