ఈనాడు ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ల పెద్ద కుమార్తె సహరి. భార‌త్‌ బయోటెక్‌ సంస్థ అధినేత కృష్ణ, సుచిత్రల కుమారుడు రేచస్‌ వీరేంద్రదేవ్‌తో వివాహం జరుగనున్నది.

 రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మనవరాలు సహరి వివాహ వేడుకకు ఇద్దరు ముఖ్యమంత్రులు కెసిఆర్, చాంద్రబాబునాయుడు హాజరయ్యారు. వివాహం రామోజీరావు ఫిల్మ్ సిటిలో శుక్రవారం అర్ధరాత్రి జరుగుతోంది. అందుకు ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.

ఈనాడు ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ల పెద్ద కుమార్తె సహరి. భార‌త్‌ బయోటెక్‌ సంస్థ అధినేత కృష్ణ, సుచిత్రల కుమారుడు రేచస్‌ వీరేంద్రదేవ్‌తో వివాహం జరుగనున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు న్యాయ, రాజకీయ, పారిశ్రామిక, మీడియా, చలనచిత్ర రంగాలకు చెందిన ప్రముఖులెందరో హాజరయ్యారు. వేడుకకు ఫిల్మ్‌సిటీ మొత్తాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేసారు.