విశాఖపట్టణం: మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంత కాలంగా జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై జేడీ లక్ష్మీనారాయణ అప్పట్లోనే వివరణ ఇచ్చారు. తాను జనసేనలోనే కొనసాగుతానని ప్రకటించారు.ఆదివారం నాడు లాంగ్ మార్చ్ సందర్భంగా విశాఖలో నిర్వహించిన సభలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Also read:టికెట్ లేని సినిమా చూపించావ్, చెడగొడుతున్నావ్: పవన్ పై అవంతి తీవ్ర వ్యాఖ్యలు

ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన కొద్ది రోజుల తర్వాత నుండి  జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  అయితే దీంతో ఆయన జనసేనను వీడుతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగానే ఖండించారు. తాను జనసేనలోనే కొనసాగుతానని ప్రకటించారు.

also rea:Also read:వైసీపీలోకి మాజీ మంత్రి గంటా..?

ఈ ప్రకటన చేసిన తర్వాత పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొనలేదు.పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. వపన్ కళ్యాణ్‌కు మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణకు మధ్య అగాధం ఏర్పడిందని ప్రచారం సాగింది. ఈ కారణంగానే జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాకులకు దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పించాయి.

పార్టీ కార్యక్రమాలకు జేడీ లక్ష్మీనారాయణ దూరంగా ఉండడం కూడ ఈ విషయమై అనుమానాలకు తావిచ్చింది. మాజీ పోలీస్ అధికారి జనసేనను వీడుతారా అనే చర్చ కూడ సాగింది. అయితే ఈ చర్చకు జేడీ లక్ష్మీనారాయణ పుల్‌స్టాప్ పెట్టారు తాను జనసేనలోనే కొనసాగుతానని ప్రకటించారు. కానీ, పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉన్నారు.

ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్టణంలో ఆదివారం నాడు నిర్వహించిన లాంగ్ మార్చ్‌లో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ లాంగ్ మార్చ్‌‌ సభలో జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యక్షమయ్యారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నజేడీ లక్ష్మీనారాయణ ఈ సభలో పాల్గొనడంతో కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి తెరపడినట్టేనని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

రెండురోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలోనే మకాం వేయనున్నారు. విశాఖ వేదికగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు.ఈ సమావేశాల్లో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొంటారా లేదా అనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  జరిగిన ఎన్నికల్లో విశాఖపట్టణం ఎంపీ స్థానం నుండి జనసేన అభ్యర్ధిగా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు  ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ సమక్షంలో జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు.  జనసేనలో చేరడానికి ముందే జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది.

అయితే  తాను టీడీపీలో చేరడం లేదని అప్పట్లోనే  జేడీ లక్ష్మీనారాయణ వివరణ ఇచ్చారు. ఈ వివరణ ఇచ్చిన తర్వాతే ఆయన  జనసేన తీర్థం పుచ్చుకొన్నారు. జనసేనలో చేరిన తర్వాత విశాఖ ఎంపీ స్థానం నుండి  పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్ధిగా విశాఖ ఎంపీ అభ్యర్ధిగా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు. అయితే స్వల్ప ఓట్ల తేడాతో ఆయన  ఎంపీగా ఓటమి పాలయ్యాడు.