టికెట్ లేని సినిమా చూపించావ్, చెడగొడుతున్నావ్: పవన్ పై అవంతి తీవ్ర వ్యాఖ్యలు
జనసేన చఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం నాడు అవంతి శ్రీనివాస్ విశాఖలో మీడియాతో మాట్లాడారు.
విశాఖపట్టణం: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై తాను బహిరంగ చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు.
ఆదివారం నాడు విశాఖ పట్టణంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా వైసీపీపై నిర్వహించిన విమర్శలపై మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు ఆ పార్టీ నేతలు సోమవారం నాడు ఖండించారు. సోమవారం నాడు విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు మడియాతో మాట్లాడారు.
తాను అన్నను అడ్డుపెట్టుకొని పైకి వచ్చిన తమ్ముడిని కాదని పవన్ కళ్యాణ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కాపు సామాజిక వర్గానికి చెందిన యువతను పవన్ కళ్యాణ్ చెడగొడుతున్నారని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్ టిక్కెట్ లేని సినిమా చూపించారని ఆయన ఎద్దేవా చేశారు.
రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. మిమ్మల్ని మీరు ముందు సెట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని ఆయన సూచించారు. గెలిస్తే మీ గొప్ప. ఓడితే జనం తప్పా? అని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
మీ సినిమా భాష ఏమిటి? తాటతీస్తా? తోలు తీస్తా? అనటం ఏమిటి? ఈ డైలాగులు సినిమాల్లో పర్వాలేదు, రాజకీయాల్లో పనికిరావని ఆయన పవన్ కళ్యాణ్ కు చెప్పారు.
మీరు చంద్రబాబుతో కలవండి. ఆ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవాలని ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు.మొన్న ఎన్నికల్లో చంద్రబాబుతొ కుమ్మక్కైనందునే జనసేనను ఓడించారని అవంతి శ్రీనివాస్ చెప్పారు.
అచ్చెన్నాయుడు ఎంత దొపిడి చేశాడొ ఎవరినడిగినా చెపుతారన్నారు. మీరు "అజ్ఞాన వాసి" మీ లాంగ్ మార్చి ఏమిటి? రెండు కిలో మీటర్లు నడవలేక కారెక్కారని ఆయన విమర్శించారు. పార్టీని నడిపేందుకు. సీనియర్ల సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
జగన్ మీద కేసులు సోనియా, చంద్రబాబూ కలిసి బనాయించారని ఆయన గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి రాజ్య సభలో ఏపి సమస్యల మీద ఎంత పోరాడుతున్నారో తెలుసుకోవాలన్నారు.
మంత్రులు బొత్స, కన్నబాబుల మీద మీ విమర్శలు సబబా? మీ అన్న చిరంజీవి ఎలా పైకి వచ్చారు? కాపులు పైకి రాకూడదా? మీరొక్కరే నేతా? ప్రజలు తిరస్కరించిన వాళ్లతొ మీరు కలవటం ఏమిటని అవంతి జనసేనాని పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడూ లేకుండా అడుగు వేయలేరా? ఇప్పటికే నీ పార్టీతో పరువు తీశావు. ఇంకా తీయకు. ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వంగోబెట్టారు, పడుకోబెట్టారు తాట కూడా తీశారు : పవన్ కు అంబటి కౌంటర్
హద్దు మీరితే తాట తీస్తా.. కన్నబాబు, విజయసాయిలకు పవన్ వార్నింగ్