పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పోలవరం నిర్మాణం,  కేంద్రం నుండి వచ్చిన సాయం, ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి తదితరాలపై చంద్రబాబు రోజుకో మాట ఎందుకు మాట్లాడుతున్నారో తనకు అర్ధం కావటం లేదన్నారు.

మొన్నటి వరకూ పోలవరం పనులు పూర్తి చేయటానికి  నవయుగ కంపెనీనే ముందుకు వచ్చిందని చంద్రబాబు అనేక మార్లు చెప్పిన విషయాన్ని ఉండవల్లి గుర్తు చేశారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ, నవయుగ కంపెనీకి పనులు అప్పగించమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారని చెప్పటం విచిత్రంగా ఉందన్నారు. రోజుకో మాట మాట్లాడటం వల్ల ప్రజల విశ్వసనీయతను చంద్రబాబు కోల్పోతున్నట్లు తెలిపారు. 2016 వరకూ అసలు పోలవరం పనులే మొదలుపెట్టలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.