టిడిపి-భాజపాలు కలిసే ఉంటాయి

టిడిపి-భాజపాలు కలిసే ఉంటాయి

వచ్చే ఎన్నికల్లో టిడిపి-భారతీయ జనతా పార్టీలు కలిసే ఎన్నికలను ఎదుర్కొంటాయని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. గురువారం ఓ మీడియాతో మాట్లాడుతూ, గుజరాత్ ఎన్నికల నేపద్యంలో రెండు పార్టీల మధ్య మిత్రత్వం కొనసాగుతుందని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ధక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో భాజపా గెలిచే అవకాశాలు లేవన్నారు. కాబట్టే 2019 ఎన్నికల్లో టిడిపితోనే జట్టుకట్టే అవకాశాలను అంచనా వేసినట్లు తెలిపారు.

ఏదేమైనా పొత్తుల వ్యవహారంపై నిర్ణయాన్ని ఎన్నికలపుడు  తీసుకుంటారని కూడా అన్నారు. అయితే, ఒంటరిగా పోటీ చేసే విషయాన్ని కూడా భాజపా జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటు, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ఒంటరి పోటీ గురించి భాజపా ఆలోచిస్తుందన్నారు. రెండు ఎన్నికలు గనుక విడివిడిగా జరిగితే నాయకత్వం ఆలోచనలో మార్పుంటున్నారు. 2018లో వివిధ అసెంబ్లీలకు జరిగే ఎన్నికల ఫలితాల మీద కూడా నిర్ణయాలు ఆధారపడి ఉంటాయన్నారు. ధక్షిణాది రాష్ట్రాల్లోని కర్నాటకలో తప్ప ఇంకెక్కడా భాజపా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos