Asianet News TeluguAsianet News Telugu

బాబు వెంట పడ్డ ఉండవల్లి

న్యాయస్ధానానికి ఉన్న విస్తృతాధికారాలతో చంద్రబాబును ముద్దాయిగా చేర్చి కేసును విచారించాలని బుధవారం కోర్టులో తన వాదనను వినిపించారు.

vundavalli

న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు వెంట పడ్డారు. ఒకపుడు మీడియా ప్రముఖుడు రామోజీరావు వెంట పడిన ఉండవల్లి రామోజీని మూడు చెరువుల నీళ్ళు తాగించారు. రెండు సార్లు రాజమండ్రి నుండి లోక్ సభకు ప్రతినిధ్యం వహించిన ఉండవల్లి న్యాయవాది కూడా. ఏ విషయంలోనైనా ఎంతో కసరత్తు చేసి గానీ మట్లాడరని పేరుంది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పగలగడం ఆయనకున్న పెద్ద బలం. ఇటీవలే రాష్ట్ర విభజనకు సంబంధించిన విషయాలపై పుస్తకాన్ని కూడా రాసిన మాజీ ఎంపి రాష్ట్ర విభజనపై న్యాయపోరాటం కూడా చేస్తున్నారు.

 

ఇదంతా ఎందుకంటే, దాదాపు ఏడాదిన్నర క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘ఓటుకునోటు’ కేసులో  చంద్రబాబుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఓటుకునోటు ఘటన వెలుగు చూసిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. సదరు కేసు దెబ్బకే ఏపి  ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వీడి విజయవాడకు వెళ్లిపోవాల్సి  వచ్చింది.

 

 తెరవెనుక జరిగిన ఒప్పందాల వల్లే ఆ తర్వాత కేసు కోమాలోకి వెళ్లిపోయిందన్నది జగద్విదితం. అయితే, వైసీపీ శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసు కారణంగా ఒక్కసారిగా కేసుకు ప్రాణం లేచి వచ్చింది. ఈ తరుణంలోనే ఉండవల్లి కూడా ఆళ్లకు మద్దతుగా అన్నట్లు కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇంప్లీడ్ అయ్యారు. న్యాయస్ధానానికి ఉన్న విస్తృతాధికారాలతో చంద్రబాబును ముద్దాయిగా చేర్చి కేసును విచారించాలని బుధవారం కోర్టులో తన వాదనను వినిపించారు.

 

 ‘మన వాళ్బు బ్రీఫ్డ్ మీ’ అన్న చంద్రబాబు గొంతును అందరూ విన్నారని కూడా ఉండవల్లి గుర్తుచేసారు. ఆళ్ళను ఎదుర్కొవటానికే చంద్రబాబు కిందా మీదా పడుతున్న సమయంలో ఆయనకు మద్దతుగా అన్నట్లు మాజీ ఎంపి కూడా తోడవ్వటం గమనార్హం. అయితే, చంద్రబాబు గురించి కూడా ఎవరూ తక్కువ అంచనా వేసేందుకు లేదులేంది.

Follow Us:
Download App:
  • android
  • ios