కాల్ మని వేధింపులు తాళలేక వీఆర్వో గౌస్ ఆత్మహత్య.. (వీడియో)

నెల నెలా వడ్డీ డబ్బులు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. దీంతోపాటు ఆ డబ్బు చెల్లించాలంటూ వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. దీంతో ఈ చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని suicide చేసుకున్నాడు.

VRO gouse commits suicide as call money harassment fails in vijayawada

కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక  ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన VRO gouse ఆత్మహత్య చేసుకున్నాడు. గౌస్ ప్రస్తుతం కొండపల్లి గ్రామ విఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం గౌస్ కొంత అప్పు చేశాడు. 

"

నెల నెలా వడ్డీ డబ్బులు సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్ మని మాఫియా సృష్టించింది. దీంతోపాటు ఆ డబ్బు చెల్లించాలంటూ వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. దీంతో ఈ చిత్రహింసలు తాళలేక సూసైడ్ లెటర్ వ్రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని suicide చేసుకున్నాడు.

విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన గౌస్ బలవన్మరణానికి పాల్పడటం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇదిలా ఉండగా, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో Call Money Mafiaకు సంబంధించి పలు ఘటనలు చోటు చేసుకొన్నాయి. తీసుకొన్న డబ్బుల కంటే అధిక మొత్తంలో వడ్డీలు చెల్లించినా కూడా వడ్డీ మాఫియా వేధింపులకు గురి చేయడంతో పలువురు ఆత్మహత్య చేసుకొన్నారు. మరికొందరు  పోలీసులను ఆశ్రయించారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో కాల్ మనీ వేధింపుల విషయమై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వడ్డీ వ్యాపారులకు టీడీపీ సర్కార్ పరోక్షంగా అండగా నిలుస్తోందనే విమర్శలు గుప్పించింది.

ఎక్కువ మొత్తం వడ్డీకి వ్యాపారులు అప్పులు ఇస్తుంటారు. డబ్బులు తీసుకొన్న వారి నుండి  పీడించి డబ్బులు వసూలు చేస్తారు.  డబ్బులు సకాలంలో  చెల్లించకపోతే అవమానాలకు గురిచేస్తారు. ఇంటి వద్దకు వచ్చి వేధింపులకు గురి చేస్తారు. అప్పులు తీసుకొన్న వారి కుటుంబసభ్యులను వేధింపులకు గురి చేస్తారు. కుటుంబ సభ్యులపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకొన్నాయి. ప్రభుత్వాలు మారినా కూడా కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలు మాత్రం ఆగలేదు.  తాము చెల్లించిన డబ్బులను రాబట్టుకొనేందుకు  వ్యాపారులు వేధింపులకు గురి చేస్తారు.  

గతంలో కర్నూల్ జిల్లాలోని బనగానపల్లె మండలం బీరవల్లిలో కాల్ మనీ వేధింపుల కారణంగా రామాంజనమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకొంది.   రామాంజనమ్మ అనే మహిళకు పెద్ద మద్దయ్య కుటుంబం రూ. 2 లక్షలు అప్పు ఇచ్చింది. రెండేళ్ల వరకు ఆమె నుండి వడ్డీ కానీ, అసలుు కానీ వసూలు చేయలేదు. అయితే రెండేళ్ల తర్వాత అసలు, వడ్డీ కలిపి రూ.. 11 లక్షలు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రతి నెల వడ్డీ కోసం ఆమెను వేధించారు. 

అంతేకాదు బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలుపోలీసులను ఆశ్రయించింది. కానీ పోలీసులు కూడ స్పందించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిందని బాధితురాలిని బెదిరించారు.  ఈ  బెదిరింపులు తట్టుకోలేక ఆమె  2020  మార్చి 11న ఆత్మహత్యకు పాల్పడింది.ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios