జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్లు పవన్ కు బహిరంగ లేఖ రాశారు. కొన్ని ప్రశ్నలు సంధించారు. 

‘పావలా అంత పరువు కూడా లేని పవన్ కళ్యాణ్ గారికి రెండున్నర లక్షల మంది సేవా సైన్యం నమస్కరించకుండా వ్రాయు లేఖ ఏమనగా…

‘అయ్యా జల్సా రాయుడు గారు…

ఈ వాలంటీర్లు అమ్మాయిలను అక్రమ రవాణా చేసే క్రిమినన్స్ అన్నారు. అయ్యా మీకు అర్థం కాని విషయం ఏంటంటే సంక్షేమం అందే ప్రతి గడపలోను మేమే ఉంటాం. అవ్వాతాతల చిరునవ్వులోనూ మేమే ఉంటాం.. వరదలు వంటి విపత్కర పరిస్థితిలో చేయందించి సాయం చేసింది వాలంటీర్లే. కరోనా లాంటి ప్రమాదకర పరిస్థితులలోనూ ప్రాణాలకు తెగించి జనాలకు సహాయపడింది మేమే.. ఇలాంటివేమీ మీ కళ్ళకు కనపడలేదా? 

వాలంటీర్లుగా మా సేవలను దేశమే ప్రశంసించి జేజేలు కొట్టింది. అది మీకు వినపడలేదా. మా గురించి మీకు కేంద్ర నిఘా సంస్థకు చెందిన వ్యక్తి చెప్పారంటున్నారు.. మేము నిజంగా అలాంటి అక్రమ పనులకు పాల్పడితే అలాంటివారు కేంద్ర ప్రభుత్వానికి సరైన ఆధారాలతో సహా నివేదిక ఇస్తారు కానీ.. మీకెందుకు చెప్పారు. అయ్యా.. పవన్ కళ్యాణ్ గారు ఒకటి అడుగుతున్నాం చెప్పండి..

జనవాణిలో ఫిర్యాదులు, వాలంటీర్లపై కోపం లేదు: పవన్ కళ్యాణ్

నువ్వేమైనా కేంద్ర హోం మంత్రివా?
కేంద్ర మంత్రివా?
పోనీ ఎంపీవా?
అసలు కనీసం ఎమ్మెల్యేగా?
లేకపోతే జెడ్పీటీసీ.. లేదా కనీసం ఎంపీటీసీ?
అవీ కాకపోతే కనీసం గ్రామానికైనా సర్పంచిగా? వార్డు మెంబర్ వా?
ఏమీ కానీ నీకు.. మా గురించి అంత దారుణమైన విషయాలను చెప్పినా ఆ నిఘా సంస్థ అధికారి ఎవరో మాకు చెప్పండి.

అఫ్ కోర్స్ మీకు తిక్క ఉండొచ్చు… దానికి మీ బాబుగారు ఇచ్చే లెక్క కూడా ఉండొచ్చు.. కానీ ఒకటి మాత్రం నిజం. మాపై నిందలు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించాల్సింది రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో దాదాపు 1,30,000 మంది మహిళలే ఉన్నారని గుర్తు రాలేదా? వారందరినీ క్రిమినల్స్ అన్నారని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారనితెలియలేదా?

అయ్యా చివరిగా ఒక మాట మాకు రాజకీయాలతో సంబంధం లేదు.. కానీ ఈ మధ్య పాలిటిక్స్ లో మీ మూడో భార్య కనబడడం లేదని..తరచుగా వినిపిస్తున్న మాట.. ఇంకా నయం దానికి కారణం కూడా మేమే అనలేదు.. ధన్యవాదాలు సార్..
 ఇట్లు 
ఏపీ సేవా సైన్యం..’ అని రాస్తూ ఓ 10 ప్రశ్నలను సంధించారు…

దీనితో పాటు.. ‘సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పై లెటర్ కి బదులిస్తారా? లేక ఈ పది ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారా?’ అంటూ ఓ పది ప్రశ్నలని పవన్ కళ్యాణ్ ముందు ఉంచారు.

అవి వరుసగా ఇలా ఉన్నాయి…

1, మహిళల అక్రమ రవాణా వాలంటీర్లు చేస్తున్నారా? ఇది నీ దత్తతండ్రి రాసిచ్చిన స్క్రిప్ట్ కాదని.. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.

2. ప్రతి నెల ఒకటో తారీకున.. ఠంచనుగా సూర్యుడు ఉదయించక ముందే అవ్వాతాతల చేతుల్లో ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ ఇస్తుంది వాలంటీర్లు కాదా?..హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.. 

3. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు చేరుస్తున్న సారధులు వాలంటీర్లు కాదా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.

4 కరోనా సమయంలోను తమ ప్రాణ ప్రాణాలను పణంగా పెట్టి గడపగడపకు తిరిగి సేవలు అందించింది వాలంటీర్లు కాదా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.

5. కరోనాతో మరణించిన వారిని సైతం తాకడానికి అయిన వారే భయపడి వదిలేస్తే.. ఆ అనాధ శవాలకు దహన సంస్కారాలు చేసింది వాలంటీర్లు కాదా?.. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.

6 పెన్షన్లు, సంక్షేమ పథకాలే కాకుండా.. వరదలు లాంటి ప్రకృతి విపత్కర పరిస్థితుల్లోనూ వాలంటీర్లు సహాయం అందించలేదా?..హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.

7. ఏపీ వాలంటీర్ వ్యవస్థను కేరళనే కాకుండా బ్రిటన్ వంటి దేశాలు కూడా ఆదర్శంగా తీసుకున్న మాట వాస్తవం కాదా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.

8. స్వయంగా దేశ ప్రధాని ఏపీలో సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరు కూడా బాగుందని ప్రశంసించలేదా..? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.

9. వేలాది మంది మహిళలు మీ దత్త తండ్రి పాలనలో మిస్సయిన మాట వాస్తవం కాదా? ఆ ప్రభుత్వంలో నువ్వు లేవా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.

10. వలంటీర్లంటే నీకు వెన్నులో మనకు.. దత్త తండ్రికి భయం. అందుకే వలంటీర్లపై నిందలు మోపుతున్నావు కదా?.. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.’

అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.