డబ్బులివ్వడానికి వెళ్లి.. వృద్దురాలిని హతమార్చిన వాలంటీర్..
విశాఖ జిల్లా పెందుర్తిలో సుజాతానగర్ సచివాలయంలో వాలంటీర్ అత్యాశకుపోయి యజమాని తల్లిని హతమార్చాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అత్యాశతో ఓ వాలంటీర్ వృద్ధురాలిని హతమార్చాడు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. సుజాతనగర్ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పార్ట్ టైంగా చికెన్ షాప్ లో జాబ్ చేస్తున్నాడు. విధులు ముగించుకున్న తర్వాత ఆ రోజు కలెక్షన్ యజమాని ఇంట్లో ఇవ్వమని చెప్పడంతో… డబ్బులతో యజమాని ఇంటికి వెళ్ళాడు.
ఆ సమయంలో యజమాని తల్లి తలుపు తీసింది. ఆమె మెడలో బంగారు గొలుసులు చూసేసరికి వాలంటీర్ కు దురాశ పుట్టింది. బంగారు గొలుసుల కోసం హత్య చేసి.. గొలుసులతో పారిపోయాడు. అయితే ఈ ఘటన అంతా అక్కడ సీసీ కెమెరాల్లోని రికార్డు అయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాలంటీర్ కోసం వెతుకుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.