విజయనగరం: విజయనగరం ఎంపీ, కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజు తుపాకీతో హల్ చల్ చేశారు. ఆదివారం సారిపల్లిలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది నిర్వహించిన పిక్నిక్ లో పాల్గొన్న ఆయన తుపాకీ చేతపట్టి గురిపెట్టారు. సరదాగా కాసేపు తుపాకీతో గురిచూశారు. 

అయితే అశోక్ గజపతిరాజు తుపాకీ గురిపెట్టడంతో చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికల్లో లక్ష్యాన్ని ఛేదించేందుకేనా అన్నట్లు గురిపెట్టారంటూ చెప్పుకొచ్చారు. అశోక్‌ తుపాకీ పట్టి లక్ష్యాన్ని గురిచూడటంపై అంతా రాజకీయ కోణంలో సరదాగా చర్చించుకున్నారు. 

మరోవైపు అశోక్ గజపతిరాజు రాజవంశీయులు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు తుపాకీ వాడటం వచ్చా అంటూ మరికొందరు చర్చించుకున్నారు. గతంలో వేటకు వెళ్లి ఉంటారా అంటూ కూడా చర్చించుకున్నారు. మెుత్తానికి తుపాకీతో అశోక్ గజపతిరాజు హల్ చల్ చెయ్యడం సరికొత్త ప్రచారానికి తెరలేపినట్లైంది.