Asianet News TeluguAsianet News Telugu

"అమ్మటానికి వాడెవ్వడు-కొనటానికి వీడెవ్వడు"...ఏమయ్యాయి:ప్రధానికి చంద్రబాబు లేఖపై అంబటి

ప్రధాని మోదీకి చంద్రబాబు రాసిన లేఖను తాను చూశానని... ఇది ఉత్తుత్తి ఉత్తరమేనని... ఇందులో పెద్దపెద్ద డైలాగులు లేవే..!? అంటూ  వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. 
 

vizag steel plant... ycp mla ambati rambabu satires on chanddrababu letter
Author
Amaravathi, First Published Feb 21, 2021, 7:32 AM IST

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను తాను చూశానని... ఇది ఉత్తుత్తి ఉత్తరమేనని... ఇందులో పెద్దపెద్ద డైలాగులు లేవే..!? అంటూ చంద్రబాబుపై వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. 

''విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై చంద్రబాబు నాయుడు ఉత్తరం రాశారంటే.. ఏం రాశారా అని చూశాం. రెండున్నర పేజీల ఉత్తరంలో రెండు పేజీలు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ జరిగిన ఉద్యమం గురించి రాశారు. మూడో పేజీ మొదటి పేరాలో నష్టాలు ఎందుకు వస్తున్నాయో అందరికీ తెలుసు అని రాశారు. చివరి వాక్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన  ప్రత్యామ్నాయాలు ఉంటే చూడండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు'' అన్నారు.  

read more   స్టీల్ ప్లాంట్ రగడ: రంగంలోకి చంద్రబాబు, ప్రైవేటీకరణ వద్దంటూ మోడీకి లేఖ

''చంద్రబాబు మోడీ గారికి లేఖ రాశారంటే, మోడీకన్నా సీనియర్ అయిన చంద్రబాబు బ్రహ్మాండం ఏదో బద్ధలు కొట్టారని అనుకున్నాం. పోనీ మొన్న విశాఖపట్నం వెళ్ళి నడిరోడ్డు మీద తెలుగులో చెప్పిన డైలాగుల్లో ఏ ఒక్కటైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారేమో అని చూశాం. "అమ్మటానికి వాడెవ్వడు-కొనటానికి వీడెవ్వడు.." అని రోజూ మోగుతున్న చంద్రబాబు, ఆయన బృందం ఈ మాట ఉత్తరంలో రాశారేమో అని చూశాం. ఏ ఒక్కటీ లేదు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటానికి వీలే లేదు అని ఒక్క వాక్యం కూడా రాయలేదు'' అని పేర్కొన్నారు. 

''స్టీల్ ప్లాంట్ ను కాపాడే ప్రత్యామ్నాయాలను సూచించినదీ లేదు. ప్రత్యామ్నాయాలు సూచిస్తూ ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తికి మద్దతు పలికిందీ లేదు. ఇంతవరకు చంద్రబాబు ఎందుకు ఉత్తరం రాయలేదు అని అడిగినందుకు.. ఉత్తుత్తిగా తెల్ల కాగితం మీద సంతకం పెట్టిచ్చినట్టు ఉంది చంద్రబాబు ఉత్తరం'' అని అంబటి ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios