విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదంటూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై కార్మిక లోకం భగ్గుమంది. కూర్మన్నపాలెం వద్ద జాతీయ రహదారిపై భైఠాయించిన కార్మికులు .. కేంద్రం దిష్టిబొమ్మను దగ్థం చేశారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదంటూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై కార్మిక లోకం భగ్గుమంది. శుక్రవారం విశాఖ కూర్మన్నపాలెం వద్ద జాతీయ రహదారిపై భైఠాయించిన కార్మికులు .. కేంద్రం దిష్టిబొమ్మను దగ్థం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు .. కార్మిక సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. 

కాగా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదంటూ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటనతో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్రజలు సంబరపడ్డారు. అయితే ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గామంటూ వస్తున్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. 

Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ .. అదంతా తప్పుడు ప్రచారం, ప్రైవేటీకరణపై తగ్గేదే లే : బాంబు పేల్చిన కేంద్రం

ఇకపోతే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ చెప్పారు. గురువారంనాడు ఫగ్గన్ సింగ్ విశాఖపట్టణం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఈ విషయమై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. ఈఓఐలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఎత్తుగడగా కేంద్ర మంత్రి మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటనతో మరోసారి కార్మిక వర్గాల్లో అలజడి రేగింది.