ఈ నెల 29న సమ్మె: నోటీసిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 29న సమ్మెలోకి వెళ్తామని కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం నాడు నోటీసు ఇచ్చింది.
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 29న సమ్మెలోకి వెళ్తామని కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం నాడు నోటీసు ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల, ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నాయి. కార్మిక సంఘాల ఆందోళనలు ఇవాళ్టికి 124 రోజుకు చేరుకొన్నాయి. ఇవాళ కార్మిక సంఘాలు సమావేశమై యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నాయి.
స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. కార్మిక చట్టాల మేరకు సమ్మె చేయడానికి 15 రోజుల ముందుగా సమ్మె నోటీసు ఇవ్వాలి. అందుకే ఇవాళ సమ్మె నోటీసును అందించాయి.అయితే ఈ నెల 29న ఒక్క రోజే సమ్మె చేస్తరా ఆ తర్వాత కూడ సమ్మెను కొనసాగిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై కార్మిక సంఘాలు స్పష్టత ఇవ్వనున్నాయి. కరోనా కేసులు కొంత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరోసారి ఆందోళనలను ఉధృతం చేయాలని కార్మికులు భావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దని ఏపీ సీఎం జగన్ ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి కోరారు.