Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రి మహిళతో ప్రయాణం: అనకాపల్లిలో ముగ్గురు గుర్తింపు.. కొనసాగుతున్న వేట

యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఆమెతో పాటూ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మరికొంతమంది వచ్చారు

vizag officials find out 3 members who travelled in ap express ksp
Author
Vizag, First Published Dec 25, 2020, 7:48 PM IST

యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఆమెతో పాటూ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మరికొంతమంది వచ్చారు.

ప్రస్తుతం వీరందరినీ ట్రేస్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆ మహిళతో పాటూ అదే బోగీలో మరో 8 మంది విశాఖ వాసులు ప్రయాణించినట్లు అధికారులకు సమాచారం అందింది.

Also Read:కృష్ణా జిల్లాలో స్ట్రెయిన్ కలకలం: యూకే నుంచి 116 మంది.. ట్రేసింగ్‌‌లో అధికారులు

వెంటనే రంగంలోకి అధికారులు అనకాపల్లిలోని లాడ్జి నుంచి విశాఖ కేజీహెచ్‌కు ముగ్గురిని తరలించారు. మిగిలిన వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఈ 8 మందిని ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

అటు కృష్ణా జిల్లాకు చెందిన కొందరు కూడా అదే బోగీలో ప్రయాణించినట్లుగా సమాచారం అందింది. వీరిని మచిలీపట్నానికి చెందిన వారుగా గుర్తించిన అధికారులు.. ట్రేసింగ్‌ పనిలో వున్నారు. కృష్ణా జిల్లా గూడవల్లి క్వారంటైన్ సెంటర్‌తో పాటు ఈడ్పుగల్లు క్వారంటైన్ సెంటర్‌ను సైతం పున: ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios