Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన: 11కు చేరిన మృతుల సంఖ్య

విశాఖపట్నంలోని ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరుకుంది. పరిస్థితి విషమంగా ఉన్నవారిని విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తరలించారు. వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు.

Vizag LG polymers gasa leak tragedy death toll reaches to 10
Author
Visakhapatnam, First Published May 7, 2020, 1:25 PM IST

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మరణాల సంఖ్య 11కు చేరుకుంది. గ్యాస్ ఎక్కువ పీల్చుకోవడం వల్ల వీరు మరణించి ఉంటారని భావిస్తున్నారు. సీరియస్ గా ఉన్నవారిని విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తరలించారు. విశాఖపట్నంలోని వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించగా, 250 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

ప్రమాదంలో కంపెనీ ఉద్యోగులు ఎవరు కూడా మరణించలేదని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి చెప్పారు కాగా, ఉదయం 5.30లకే పరిస్థితి అదుపులోకి వచ్చిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు ప్రమాదానికి సంబంధించి డయల్ 100కు ఫోన్ వచ్చిందని చెప్పారు  గ్యాస్ లీక్ బాధితుల కోసం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. పరిశ్రమల శాఖ ఏజీ కార్యాలయంలో ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటైంది.

Also Read: విశాఖ పర్యటన.. చంద్రబాబుకి కేంద్రం అనుమతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఆ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది. ఆ విషవాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించింది. బుధవారం ఆర్థరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకైంది.మూగజీవులు కూడా దాని తీవ్రతకు గురై పడిపోతున్నాయి. మనుషులు అక్కడికక్కడే కుప్ప కూలిపోతున్న దృశ్యాలను కూడా కనిపిస్తున్నాయి.

విషయవాయువుతో చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలో, కడుపులో వికారం పుట్టడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇళ్లు వదిలేసి మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీశారు. ఐదు గ్రామాల ప్రజలను అధికారులు అధికారులు తరలిస్తున్నారు.

Also Read: విశాఖలో గ్యాస్ లీకేజీపై ఫోరెన్సిక్ టీమ్ విచారణ: ఏపీ డీజీపీ సవాంగ్

తీవ్ర అస్వస్థకు గురైనవారిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తన్నారు. అస్వస్థకు గురైనవారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ నగరం పోలీసు కమిషనర్ ఆర్ కె మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో విషవాయులు లీలకైనట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అదుపు చేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు సాగిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios