Asianet News TeluguAsianet News Telugu

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై హైకోర్టులో విచారణ

విశాఖలో గ్యాస్ లీక్ ఘటనను ఏపీ హైకోర్టు సోమవారం సుమోటాగా స్వీకరించి విచారించింది. ఈ సందర్బంగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

vizag gas leak issue hearing adjourned in ap high court
Author
Amaravathi, First Published May 18, 2020, 6:34 PM IST

విశాఖలో గ్యాస్ లీక్ ఘటనను ఏపీ హైకోర్టు సోమవారం సుమోటాగా స్వీకరించి విచారించింది. ఈ సందర్బంగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

Also Read:వైజాగ్ గ్యాస్ లీక్: ఇద్దరు చిన్నారుల సహా మృతులు వీరే

అయితే తమకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. దీనికి సమ్మతించిన కోర్టు కౌంటర్ దాఖలకు సమయం ఇస్తూ... తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది. 

విశాఖపట్నంలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఆ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది.

Also Read:వైజాగ్ గ్యాస్ లీక్: ఇద్దరు చిన్నారుల సహా మృతులు వీరే

ఆ విషవాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించింది. బుధవారం ఆర్థరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకైంది.మూగజీవులు కూడా దాని తీవ్రతకు గురై నురగలు కక్కుతూ మరణించగా, సమీపంలోని భారీ వృక్షాలు మాడిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స  పొందుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios