తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి ఎమ్మెల్సీ విష్ణు కుమార్ రాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందని, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గ్రాఫ్ పెరుగుతోందని ఆయన అన్నారు. 

జగన్ ఏది చేస్తే చంద్రబాబు అది చేస్తున్నారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. చంద్రబాబు చేసింది ధర్మపోరాటం కాదు, అధర్మపోరాటమని ఆయన వ్యాఖ్యానించారు. టిడిపి, బిజెపి, జనసేన కలిసి గత ఎన్నికల్లో పోటీ చేస్తే వైసిపి కన్నా ఐదు లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని అన్నారు. 

విడిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ పతనం ఖాయమని అన్నారు. పొత్తుపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పట్టిసీమపై 15 రోజుల్లో సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతామని చెప్పారు. విచారణ జరిగితేనే దోషులకు శిక్ష పడుతుందని అన్నారు.