Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఉత్సవ్: పేరు మాత్రమే లోకల్... అంతా నాన్ లోకల్

విశాఖ ఉత్సవ్ ఇంకా ప్రారంభమవకముందే దీని చుట్టూ వివాదాలు చుట్టుకున్నాయి. స్థానిక కళాకారులకు సెంట్రల్ పార్క్ లో జరిగే కార్యక్రమాల్లో మినహా ఎక్కడా అవకాశం కల్పించట్లేదని అక్కడి లోకల్ కళాకారులూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేజి పనులు కూడా బయటవారికే కాంట్రాక్టులు ఇచ్చారని అక్కడి లోకల్ వాసులు అంటున్నారు. 

vishakha utsav: except for the name nothing is local
Author
Vishakhapatnam, First Published Dec 28, 2019, 4:01 PM IST

విశాఖపట్నం: విశాఖపట్నంలో నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. రాజధాని విషయంగా వివాదాలు చెలరేగడం మొదలైన తరువాత జగన్ అటెండ్ అవనున్న ఒక మెగా ఈవెంట్ ఇదే. 

ఈ ఈవెంట్ ఇంకా ప్రారంభమవకముందే దీని చుట్టూ వివాదాలు చుట్టుకున్నాయి. స్థానిక కళాకారులకు సెంట్రల్ పార్క్ లో జరిగే కార్యక్రమాల్లో మినహా ఎక్కడా అవకాశం కల్పించట్లేదని అక్కడి లోకల్ కళాకారులూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేజి పనులు కూడా బయటవారికే కాంట్రాక్టులు ఇచ్చారని అక్కడి లోకల్ వాసులు అంటున్నారు. 

బీచ్ రోడ్డులో జరుగుతున్న అన్ని ప్రధాన కార్యక్రమాలకు వినోయీగిస్తున్న సరుకంతా విశాఖపట్నానిదే. కానీ కాంట్రాక్టు మాత్రం బయట వ్యక్తులకు ఇచ్చారు. ఇక్కడి సామాను, ఇక్కడి లేబరే పనిచేస్తుంటే...కాంట్రాక్టు హైదరాబాద్ వాటికిస్తే డబ్బు అక్కడికి తరలిపోదా అని వారు ప్రశ్నిస్తున్నారు. 

Also read: జగన్ కు వైసీపీ ఎంపీ షాక్: అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ పై చంద్రబాబును వెనకేసుకొచ్చిన రఘురామకృష్ణం రాజు

ప్రభుత్వం మారినా రాజకీయ నేతల వైఖరి మాత్రం మారట్లేదని... అప్పట్లో ఘంటా శ్రీనివాసరావు ఎలా చేసారో ఇప్పుడు ఈ వైసీపీ నేతలు కూడా అలానే చేస్తున్నారని వారు వాపోతున్నారు.

గతంలో గంట శ్రీనివాసరావు కేవలం తనకు నచ్చినవారికే కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని, ఇప్పుడు వైసీపీ హయాంలో లోకల్స్ కి కాకుండా బయటివారికి కాంట్రాక్టులు ఇచ్చారని వారు తమ పొట్టలు కొడుతున్నారని లోకల్స్ వాపోయారు. 

విశాఖ ఉత్సవ్ కోసం ప్రభుత్వం 3కోట్ల రూపాయలు కేటాయించింది. ఏర్పాట్లకోసం జె మీడియా అనే హైదరాబాద్ కు చెందిన సంస్థ 1.89 కోట్లకు కాంట్రాక్టు దక్కించుకుంది. వారు హైదరాబాద్ నుండి కేవలం ఒక సౌండ్ సిస్టం మాత్రమే తీసుకువస్తున్నారని, మిగిలిన సామాన్లు బల్ల నుండి తెరలవరకు అన్ని ఇక్కడివేనని వారు వాపోతున్నారు. 

సెంట్రల్ పార్కు దగ్గర కార్యక్రమాలను మాత్రమే లోకల్ కళాకారులకు ఇచ్చారని, బీచ్ రోడ్డులో జరిగే ముఖ్యకార్యక్రమంలో స్థానిక కళాకారులకు మొండిచేయి ఇచ్చారని అక్కడి స్థానిక కళాకారులూ వారి గోడు వెళ్లబోసుకున్నారు.

Also read: రాజధాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదు: విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

పండగపూటైనా తాము తమ పొట్టనింపుకుందామని అనుకుంటే...తమకు ఆ అవకాశం దక్కకుండా పక్కరాష్ట్రం వాళ్ళు వచ్చి వాటిని తన్నుకుపోయారని బాధపడాలో లేక తమ నోటికాడి కూడు గుంజేసి పక్కరాష్ట్రాల వారికి పెడుతున్నారని బాధపడాలో అర్థం కావట్లేదని వారు బాధను వెళ్లగక్కారు. 

హైదరాబాద్ కు చెందిన కంపెనీకి కాంట్రాక్టు ఎక్కువ రేటుకు ఇచ్చారని, తమకు గనుక ఇచ్చి ఉంటె అంతకన్నా తక్కువ ఖర్చుకే చేసేవాళ్లమని స్థానిక కాంట్రాక్టర్లు అంటున్నారు.

ఈసారి స్టేజీలు కూడా బాగా తగ్గిపోయాయని, ఇంతకుముందు బీచ్ రోడ్డులో 2, శిల్పారామం, సెంట్రల్ పార్కుల్లో ఒక్కోటి చొప్పున స్టేజీలు ఉండేవని, ఈ సారి మాత్రం కేవలం సెంట్రల్ పార్కు, బీచ్ రోడ్డులో ఒకటి మాత్రమే స్టేజీలు ఏర్పాటు చేసారని వారు అన్నారు. 

యాంకర్ సుమ వ్యాఖ్యానం నుంచి మొదలుకొని వీ అన్ బీటబుల్స్ టీం డాన్స్ కార్యక్రమం వరకు అన్నీ బయట వ్యక్తులకే అప్పగించారని, తమకు గనుక ఇచ్చి ఉంటె...మా పండగ అని ఫీల్ అయ్యి విశాఖ ఖ్యాతిని ఇనుమడింపచేసేవారమని వారు అన్నారు. కనీసం బాణాసంచా కాల్చే కార్యక్రమంలో కూడా లోకల్ వాసులు లేరని వారు ఆవేదన వ్యక్తం చేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios