Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో పెళ్లి మండపంలోనే మృతి చెందిన సృజన: మొబైల్ లో డేటా డిలీట్

విశాఖపట్టణం జిల్లాలోని మధురవాడలో పెళ్లి పీటలపై కుప్పకూలిన వధువు  సృజన మరణించిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సృజన బ్యాగులో గన్నేరు పప్పు లభ్యం కావడం కలకలం రేపుతుంది.

Visakhapatnam Police Seized Bride Sujana Mobile
Author
Vissannapetaa, First Published May 13, 2022, 12:10 PM IST

విశాఖపట్టణం; Visakhapatnam  జిల్లాలోని Madhurawada లో పెళ్లి మండపంలోనే వధువు సృజన కుప్పకూలిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సృజన మరణించింది. Srujana మరణానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సృజన మొబైల్ కోసం పోలీసులు తల్లిదండ్రులను కోరారు. 

also read:విశాఖ పెళ్లి కూతురు మృతి కేసులో ట్విస్ట్ : సృజన బ్యాగులో గన్నేరు పప్పు, ఇష్టం లేని పెళ్లే కారణమా..?

అయితే సృజన Mobile ను ఆలస్యంగా పోలీసులకు సృజన కుటుంబ సభ్యులు ఇచ్చినట్టుగా సమాచారం.  అయితే సృజన ఫోన్ లో చాటింగ్స్, పోన్ కాల్స్ సమాచారాన్ని డిలీట్ చేసి ఉంది. ఈ ఫోన్ లో మిస్డ్ కాల్స్ లిస్ట్ మాత్రమే ఉండడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

సృజన ఫోన్లో ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు టెక్ నిపుణులను సంప్రదించారు.సృజన డెడ్ బాడీకి శుక్రవారం నాడు Post Mortem  నిర్వహించనున్నారు.ఈ రిపోర్టులో సృజన మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉంది.  సృజన మరణానికి విషం కలిసిన ఆహారపదార్ధాలు తినడం కారణమని ఆమెకు చికిత్స అందించిన వైద్యులు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే సృజన బ్యాగులో గన్నేరు పప్పును పోలీసులు గుర్తించారు. అయితే సృజనది ఆత్మహత్య అని తాము అనుకోవడం లేదని ఆమె సోదరుడు చెప్పారు. సృజనతో పాటు వరుడు శివాజీ కుటుంబ సభ్యులకు  నచ్చడంతోనే ఈ పెళ్లిని నిర్ణయించినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. సృజనకు కూడా ఈ పెళ్లి ఇష్టమని చెబితేనే పెళ్లిని కుదిర్చినట్టుగా మృుతురాలి సోదరుడు ఇవాళ మీడియాకు తెలిపారు.

సృజనకు అనారోగ్య సమస్యలున్నాయా అనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యల కోసం ఉపయోగించిన మందులు వికటించి ఆమె మరణించిందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios