విశాఖలో కిడ్నాప్: రియల్టర్ సురక్షితం, నిందితుల నుండి రూ. 7 లక్షలు సీజ్
విశాఖపట్టణంలో రియల్టర్ మధుసూధన్ రావు కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 7 లక్షలను సీజ్ చేశారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో రియల్టర్ మధుసూధన్ రావు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ప్లాట్ల విక్రయంలో రియల్టర్ మధుసూధన్ రావు, రౌడీషీటర్ హేమంత్ మధ్య వివాదం నెలకొంది. దీంతో రియల్టర్ మధుసూధన్ రావును రౌడీషీటర్ హేమంత్ కిడ్నాప్ చేశాడు. ఈ విషయమై రియల్టర్ మధుసూధన్ రావు కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం విశాఖపట్టణం సీపీ శ్రీకాంత్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రియల్టర్ మధుసూధన్ రావును పోలీసులు కిడ్నాపర్ల నుండి రక్షించారు. నిందితుల నుండి రూ. 7 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.