శ్వేత మృతిపై పోలీసుల విచారణ ముమ్మరం: కీలకం కానున్న పోస్టుమార్టం రిపోర్టు


విశాఖపట్టణం ఆర్ కే బీచ్ లో  అనుమానాస్పదస్థితిలో  మృతి చెందిన  శ్వేత   డెడ్ బాడీకి  విశాఖపట్టణం  కేజీహెచ్ ఆసుపత్రిలో  పోస్టుమార్టం నిర్వహించనున్నారు. 

Visakhapatnam Police Investigates on Swetha death Case  lns

విశాఖపట్టణం:  నగరంలోని ఆర్ కే బీచ్ లో   అనుమానాస్పద  స్థితిలో వివాహిత  శ్వేత  మృతిపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు.  మణికంఠ  కుటుంబ సభ్యులు వేధించడం వల్లే  శ్వేత  మరణించిందని  రమాదేవి  ఆరోపించారు.  బుధవారంనాడు  తెల్లవారుజామున  శ్వేత  మృతదేహం ఆర్ కే బీచ్ లో  కన్పించింది.  వాకర్స్  ఈ డెడ్ బాడీని  గుర్తించి  పోలీసులకు సమాచారం  ఇచ్చారు. ఈ సమాచారం  ఆధారంగా  పోలీసులు దర్యాప్తును  ప్రారంభించారు. మంగళవారంనాడు సాయంత్రమే  శ్వేత  ఇంటి నుండి  వెళ్లిపోయింది.  ఈ విషయమై  శ్వేత  అత్తామామలు,  శ్వేత తల్లి కూడ న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మంగళవారంనాడు శ్వేత కు వారి అత్తింటి వారి మధ్య  గొడవ జరిగింది. ఇదే విషయమై  భర్త మణికంఠతో   ఆమె ఫోన్ లో మాట్లాడింది.  భర్తతో కూడా  ఈ విషయమై  ఆమె  గొడవ పెట్టుకుంది,. తాను సర్ది చెప్పే ప్రయత్నం  చేస్తున్నా  కూడా శ్వేత ఫోన్  కట్  చేసిందని మణి కంఠ   మీడియాకు  చెప్పారు.

మరో వైపు  శ్వేత  డెడ్ బాడీకి  విశాఖపట్టణం  కేజీహెచ్ ఆసుపత్రిలో  ఇవాళ  పోస్టుమార్టం నిర్వహించనున్నారు. శ్వేత ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా హత్య  చేశారా అనే విషయం  ఈ పోస్టు మార్టం నివేదికలో  తేలనుంది. 

also read:' అత్తింటి వేధింపులే కారణం':శ్వేతను వేధించలేదన్న భర్త మణికంఠ

న్యూపోర్టు  పోలీస్ స్టేషన్ పరిధిలోని  పెదగంట్యాడ  నుండి ఆర్ కే బీచ్ వరకు  శ్వేత  ఎలా వచ్చిందనే విషయమై  కూడా  పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఈ మార్గంలోని సీసీటీవీ పుటేజీని  కూడా  పోలీసులు పరిశీలిస్తున్నారు.  ఈ కేసుకు సంబంధించి  ఇరు కుటుంబసభ్యుల  నుండి  పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.  శ్వేత  మృతికి  సంబంధించిన   కారణాలపై  పోలీసులు అడిగి తెలుసుకున్నారు.  మరో వైపు   శ్వేత  ఉపయోగించిన  ఫోన్,  శ్వేత  రాసినట్టుగా  ఉన్న సూసైడ్ లేఖను  పోలీసులు  స్వాధీనం  చేసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios