Asianet News TeluguAsianet News Telugu

కిడ్నాపర్లతో ఎంపీ ములాఖత్ అంటూ పవన్ వ్యాఖ్యలు.. స్పందించని ఎంవీవీ సత్యనారాయణ

తనపై  జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు విశాఖ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నిరాకరించారు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వారితో ఎంపీ ములాఖత్ అయ్యారని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

visakhapatnam mp mvv satyanarayana no comment on janasena chief pawan kalyan ksp
Author
First Published Aug 12, 2023, 4:55 PM IST

తనపై  జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు విశాఖ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నిరాకరించారు. అంతకుముందు సత్యనారాయణపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వారితో ఎంపీ ములాఖత్ అయ్యారని ఎద్దేవా చేశారు. అలాంటి ముఠాలతో వైసీపీ నేతలు దందాలు చేస్తున్నారని.. డబ్బులతో గెలిచిన నాయకులు ఇలాగే దద్ధమ్మల్లాగే వుంటారని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని జనసేన అధినేత స్పష్టం చేశారు. 

ఇకపోతే.. పవన్ కల్యాణ్ విశాఖలో వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు.. వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఇళ్లలోకి తీసుకొస్తున్నారని అన్నారు. ఇళ్లలోకి ఏ టైమ్ వస్తారో తెలియదని అన్నారు. దండుపాళ్యం బ్యాచ్‌కు, వాలంటీర్లకు తేడా లేదని విమర్శించారు. 

ALso Read: వాలంటీర్ల‌కు మాత్రం పోలీసు వెరిఫికేషన్ లేదు.. దండుపాాళ్యం బ్యాచ్‌కు వాళ్లకు తేడా లేదు: పవన్

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..  ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటం చూసిన వాలంటీర్.. ఆమె మెడలో ఉన్న  బంగారు తాడు కోసం హత్య చేశాడని అన్నారు. నమ్మకంగా లోనికి అనుమతిస్తే.. అతి కిరాతకంగా హత్య చేశాడని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని ఆమె కుటుంబం కూడా కోరుకుంటుందని అన్నారు. ఈ కేసులో వాలంటీర్ చేసిన దురాగతాన్ని బయటకు తీసుకొచ్చిన పోలీసు శాఖను అభినందిస్తున్నట్టుగా చెప్పారు. 

వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాలేదని.. తద్వారా వారి ఆలోచన ఏమిటో అర్థం అవుతుందని అన్నారు.  ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ.. వైసీపీ కార్యకర్తల కోసం సమాంతరంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్న, పాస్‌పోర్టు  కావాలన్న పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్దం అని విమర్శించారు. నవరత్నాల కోసం పెట్టుకున్న వ్యవస్థ ప్రజల ప్రాణాలు తీస్తే ఎలా ప్రశ్నించారు. తనకు ఆంక్షలు విధిస్తున్నారని.. వాలంటీర్లకు మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవని.. వారికి ఆంక్షలు విధిస్తే అరాచకాలు జరగవని  అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios