అమెరికాలో బాంబు సైక్లోన్: ఇద్దరిని కాపాడే క్రమంలో విశాఖవాసి గోకుల్ మృతి

అమెరికాలో  జరిగిన ప్రమాదంలో  ఇద్దరిని కాపాడే క్రమంలో  విశాఖపట్టణానికి చెందిన  గోకుల్ మరణించాడు.  తన  కుటుంబ సభ్యుల ముందే  గోకుల్  మృతి చెందాడు.

Visakhapatnam  man  Gokul dies  in US Bomb Cyclone

విశాఖపట్టణం:అమెరికాలో జరిగిన ప్రమాదంలో  విశాఖపట్టణానికి చెందిన  గోకుల్  మృతి చెందారు. అమెరికాలోని జరిగిన ప్రమాదంలో  ఇద్దరిని రక్షించబోయి  గోకుల్  కూడా  మృతి చెందాడు.గుంటూరు జిల్లా  పెదనందిపాడు కు చెందిన  నారాయణ, హరిత దంపతులను  రక్షించే క్రమంలో గోకుల్  మరణించాడు. విశాఖకు చెందిన  ప్రముఖ రచయిత  మేడిశెట్టి శంకర్ రావు  కుమారుడే  గోకుల్.   

అమెరికాలో మంచు తుఫాన్  దృశ్యాలను నారాయణ ఆయన భార్య హరితలు   ఐస్ లేక్ లో  దృశ్యాలను  చిత్రీకరించే సమయంలో  ప్రమాదానికి గురయ్యారు.  ఐస్ క్యూబ్ పై  నిలబడి ఫోటోలు తీసుకొనే క్రమంలో   వీరిద్దరూ  ఐస్ లేక్ లో  చిక్కుకున్నారు.  వీరిని రక్షించేందుకు గోకుల్ ప్రయత్నించారు. కానీ   నారాయణ, హరితతో పాటు  గోకుల్ కూడా  ఈ ప్రమాదంలో  మరణించాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో  గోకుల్ భార్య  శ్రీదేవి, కూతురు  మహతి  కూడా అక్కడే ఉన్నారు. వీరి కళ్ల ముందే  గోకుల్  మృతి చెందడంతో  వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

నారాయణ, హరిత దంపతుల మృతదేహలను స్వగ్రామం  గుంటూరు జిల్లా పాలపర్రుకు రప్పించేందుకు  కుటుంబ సభ్యులు  ప్రయత్నిస్తున్నారు. ఈ మృతదేహలు  స్వగ్రామానికి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.  అమెరికాలో  మంచు తుఫాన్  జన జీవితాన్ని  అతలాకుతలం చేసింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios