ఒడిశాలో చిక్కుకున్న మత్స్యకారులు: గంజాం పోర్టులోకి అనుమతివ్వాలంటున్న విశాఖవాసులు


చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. విశాఖ నుండి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. 

Visakhapatnam Fishermen Urge To Give Permission For Going Ganjam port

భువనేశ్వర్: చేపల వేటకు వెళ్లిన  Fishermen సముద్రంలో చిక్కుకున్నారు. Odisha కు సమీపంలోని సముద్రంలో తమ బోట్లతో సహా చిక్కుకున్న జాలర్లు తమను Ganjam పోర్టులోకి అనుమతివ్వాలని కోరుతున్నారు.  చేపల వేట కోసం 30 ఫిషింగ్ బోట్లతో మత్స్యకారులు వెళ్లారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపల వేటకు ఆటంకం ఏర్పడింది. సముద్రంలో బోట్లతోనే మత్స్యకారులున్నారు.తమను గంజాం పోర్టులోకి అనుమతించేందుకు అధికారులు సహకరించాలని మత్య్సకారులు కోరారు.

విశాఖపట్టణం ప్రాంతానికి చెందిన జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు.  అయితే వాతావరణం అనుకూలించలేదు.  దీంతో మత్స్యకారులు సముద్రంలోనే ఉండిపోయారు. చేపల వేటకు వాతావరణం అనుకూలించడం లేదు. వాతావరణం అనుకూలించని నేపథ్యంలో  మత్స్యకారులు సమీపంలోని పోర్టుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం పోర్టులోకి వెళ్లేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని కూడా మత్స్యకారులు కోరుతున్నారు.ఈ విషయమై అధికారులతో మత్స్యకారులు సమాచారం చేరవేశారు.

చెక్క నరసింహరావు, మోకా వెంకటేశ్వరరావు, విశ్వనాథపల్లి చినమస్తాన్ , రామాని నాంచార్లు సముద్రంలో వేటకు వెళ్లి  ఆచూకీ లేకుండా పోయారు. ఆచూకీ లేకుండా పోవడానికి ముందు రోజు తాము ప్రయాణీస్తున్న బోటు ఇంజన్ చెడిపోయిందని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టింది. ఐదు రోజుల తర్వాత మత్స్యకారులు తాము సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ నలుగురు మత్స్యకారుల వద్ద ఉన్న ఫోన్లలో కూడా చార్జీంగ్ అయిపోవడంతో వారి సమాచారం తెలపడం సాధ్యం కాలేదు. అయితే వీరి కోసం ఆరు బోట్లు, నేవీ హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చివరకు మత్య్సకారులు ఒడ్డుకు చేరుకున్న తర్వాత తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios